కమల్ హాసన్ ఫాన్స్ కి పర్ఫెక్ట్ గిఫ్ట్, మాస్ ఆడియన్స్ కి ఫుల్ మీల్స్.. విక్రమ్ మూవీ. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ కలయికలో తెరేక్కించిన విక్రమ్ మూవీ తెలుగు, తమిళ, హిందీ. కన్నడ, మళయాళంలోనే కాదు, ఓవర్సీస్ లోను అదిరిపోయే కలక్షన్స్ కొల్లగొడుతుంది. కొన్నేళ్లుగా హిట్ మిస్ అవుతూ నాలుగేళ్లుగా వెండితెరకి దూరమైన కమల్ హాసన్ కి విక్రమ్ లాంటి పర్ఫెక్ట్ హిట్ పడడం తో ఆయన ఫాన్స్ మాత్రమే కాదు, కమల్ హాసన్ కూడా ఫుల్ ఖుషీగా ఉన్నారు.
మరి తనకి అంతలాంటి సూపర్ హిట్ ఇచ్చిన లోకేష్ కనగరాజ్ కి కమల్ హాసన్ కూడా ఓ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. అది అలాంటి ఇలాంటి గిఫ్ట్ కాదు.. ఓ పెద్ద కారుని, కాస్ట్లీ కారుని గిఫ్ట్ గా ఇవ్వడం కోలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది. ఖరీదైన లెక్సస్(Lexus) కంపెనీ కారును కమల్ హాసన్ లోకేష్ కనగరాజ్ కి గిఫ్ట్ గా ఇచ్చారు. ప్రస్తుతం కమల్, లోకేష్ కి గిఫ్ట్ ఇచ్చిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.