గత రెండు రోజులుగా బాలీవుడ్ మొత్తం సల్మాన్ ఖాన్ మర్డర్ న్యూస్ పై కలకలం గా మారింది. సల్మాన్ ఖాన్ తనని చంపడానికి ఎవరో ప్రయత్నం చేస్తున్నారంటూ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా ని అత్యంత క్రూరంగా మర్డర్ చేసిన ముఠాలోని లారెన్స్ బిష్ణోయ్ పేరు మరోసారి సల్మాన్ ఖాన్ కేసు విషయంలో బయటికి వచ్చింది. లారెన్స్ బిష్ణోయ్ ని పోలీస్ లు విచారిస్తుండగా.. సల్మాన్ ఖాన్ ని లారెన్స్ బిష్ణోయ్ హత్య చెయ్యాలనుకున్న విషయాన్ని అతను పోలీస్ ల ముందు బయటపెట్టినట్లుగా తెలుస్తుంది.
కొన్నేళ్లు క్రితమే లారెన్స్ బిష్ణోయ్ తన అనుచరుల చేత సల్మాన్ ఖాన్ నివాసం ఉండే గెలాక్సీ అపార్ట్ మెంట్ దగ్గర రెక్కీ నిర్వహించాడని, అలాగే సల్మాన్ ఖాన్ దొరకగానే గురి తప్పకుండా కాల్చేందుకు ఫిన్ లాండ్ తయారీ అస్సాల్ట్ రైఫిల్ ను వేరే దేశం నుండి తెప్పించారని, సల్మాన్ ఖాన్ మర్డర్ కి తెప్పించిన తుపాకీ ఖరీదు 3 లక్షల నుంచి 4 లక్షల వరకు ఉంటుందని.. కాకపోతే సింగర్ హత్య కేసులో లారెన్స్ బిష్ణోయ్ అనుచరుడ్ని, ముఠా సభ్యుల్ని పోలీసులు అరెస్ట్ చేయడంతో సల్మాన్ ఖాన్ మర్డర్ ప్లాన్ విఫలమైంది అంటున్నారు. మరి సల్మాన్ ఖాన్ హత్య కి ఈ ముఠా మాత్రం చాలా పెద్ద స్కెచ్ వేసినట్లుగా ఈ వ్యవహారం చూస్తే అర్ధమవుతుంది.