ఏ ఛానల్ అయినా తమ షోస్ టీఆర్పీ పెంచుకోవడానికి ఎంతకైనా తెగించేలా కనిపిస్తుంది ప్రస్తుతం టివి ఛానల్స్ వ్యవహారం. సుమ షోస్ అంటే ఎంతో నీట్ గా క్లీన్ గా ఉండే షోలో కూడా ఈ మధ్యన అస్లీలత కనిపిస్తుంది. క్యాష్ షో టీఆర్పీ కోసం భర్య భర్తల మధ్యన ముద్దు సీన్స్ ని ఎంకరేజ్ చేస్తుంది సుమ. జబర్దస్త్ లో కాంట్రవర్సీ స్కిట్స్ చేసే హైపర్ ఆది జబర్దస్త్ ని వదిలేసి ఢీ డాన్స్ షో, శ్రీదేవి డ్రామా కంపెనీ చేసుకుంటున్నాడు. ఇక ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ నుండి సుధీర్ కూడా వెళ్లిపోవడంతో ఆది, రామ్ ప్రసాద్ లు ఆ షో ని పైకి లేపడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారు.
గత వారం రష్మీ స్టేజ్ పై పడిపోయినట్టుగా చూపించిన నిర్వాహకులు.. ఈ వారం హైపర్ ఆదిని నిజమైన పోలీస్ లు అరెస్ట్ చేసినట్టుగా ప్రోమో వదిలారు. ఎప్పటిలాగే హైపర్ ఆది, రామ్ ప్రసాద్ శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ పై కామెడీ చేస్తున్నారు, టివి ఆర్టిస్ట్ లు డాన్స్ చేస్తున్నారు. ఆది కి సన్మానం అనగానే.. ఆది ఆయన్ని సన్మానం చేసి పంపినట్టుగా నాకు సన్మానం చేసి పంపిస్తారా అని అడిగాడు. అంటే సుధీర్ కి సన్మానం చెయ్యగానే ఆయన షో నుండి జంప్ అన్నట్టుగా ఆది మాటలు ఉన్నాయి. ఇంతలో ఆది తనకి అన్యాయం చేశాడంటూ ఓ అమ్మాయి ఎంట్రీ ఇచ్చింది.
ఆ తర్వాత ఆది స్టేజ్ పై ఉండగా.. పోలీస్ లు వచ్చి అది యాక్సిడెంట్ చేసాడని, ఆ యాక్సిడెంట్ అయిన వ్యక్తి చావుబతుల్లో ఉన్నాడనగానే షో నిర్వాహకులు పది నిమిషాలు ఆగండి అన్నా పోలీస్ లు పట్టించుకోలేదు. రామ్ ప్రసాద్ పక్కన వెళ్లి మాట్లాడుకుందాం అన్నా వారు వినలేదు. ఆదిని షో స్టేజ్ పైనుండి అదుపులోకి తీసుకున్న ప్రోమో సోషల్ మీడియాలో హైలైటయ్యింది.