చిన్న హీరోలైనా పెద్ద హీరోలయినా పబ్లిక్ లోకి వస్తున్నారంటే వాళ్ళ ఫాన్స్ లో ఉండే క్రేజ్ పక్కనబెడితే ఆడియన్స్ లోను విపరీతమైన క్యూరియాసిటీ కనిపిస్తుంది. అదే స్టార్ హీరోలైతే చెప్పక్కర్లేదు. ఏ ప్లేస్ అయినా కిక్కిరిసిపోతుంది. స్టార్ హీరోల సినిమాలకు పోలీస్ పర్మిషన్ తీసుకుని ఈవెంట్ ఎర్పాటు చేస్తే లెక్కకు మించి ప్రేక్షకులు, ఫాన్స్ వచ్చేస్తారు. అది స్టార్ హీరోలకుండే రేంజ్, క్రేజ్. కానీ స్టార్ హీరోల రేంజ్ కి క్రేజ్ కి సమానమైన క్రేజ్ ఓ హీరోయిన్ కి ఉంది. అది నేచురల్ బ్యూటీ సాయి పల్లవి. గతంలో సాయి పల్లవి ఓ ఈవెంట్ కి గెస్ట్ గా హాజరైతే అక్కడ కీర్తి సురేష్ ని వదిలేసి సాయి పల్లవిని పొగిడారు సుకుమార్ లాంటి సెలబ్రిటీస్. అంతేకాదు ఫాన్స్ కూడా సాయి పల్లవి, సాయి పల్లవి అంటూ గొడవ చెయ్యడం చూసి కీర్తి సురేష్ మొహం మాడిపోయింది.
తాజాగా సాయి పల్లవి తాను నటించిన విరాట పర్వం ప్రమోషన్స్ కి హాజరవుతుంది. అక్కడ పాన్ ఇండియా స్టార్ రానా ఉన్నప్పటికీ.. అందరూ సాయి పల్లవి కోసమే వస్తున్నట్లుగా కనిపిస్తుంది పరిస్థితి. కర్నూల్ ఈవెంట్ లో అయితే వర్షం పడుతున్నా సాయి పల్లవి స్పీచ్ కోసమే ఎదురు చూసారు. నిన్న విజయవాడలోనూ విరాట పర్వం ఈవెంట్ లో సాయి పల్లవి కి జై జై లు పలకడం చూస్తుంటే స్టార్ హీరోలు పై ఉన్న ప్రేమని సాయి పల్లవి పై కూడా చూపిస్తున్నారుగా ఆమె ఫాన్స్ అంటారేమో..