బాలకృష్ణ బర్త్ డే జూన్ 10. జూన్ పది వచ్చింది అంటే ఆయన ఫాన్స్ కి పండగే. ఎందుకంటే బాలకృష్ణ బర్త్ డే వేడుకలతో పాటుగా.. ఆయన సినిమాల నుండి కొత్త లుక్స్ కానీ టీజర్ కానీ రిలీజ్ అవుతాయి.. కాబట్టి నందమూరి ఫాన్స్ ఆయన బర్త్ డే కోసం తెగ వైట్ చేస్తారు. అందులోను బాలయ్య బాబు తన కొడుకు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశంపై ఎలాంటి అప్ డేట్ ఇస్తారో అనే కుతూహలం కూడా ఉంటుంది. గత రెండేళ్లుగా అఖండ అప్ డేట్స్ తోనే సరిపెట్టుకుంటున్న బాలయ్య ఫాన్స్ కి ఈసారి గోపీచంద్ మలినేని NBK107 నుండి ఓ పవర్ ఫుల్ అప్ డేట్ ఇవ్వబోతున్నారు. మాస్ ఆడియన్స్ కి మెచ్చేలా ఆ అప్ డేట్ ఉండడం ఖాయమంటున్నారు ఆయన అభిమానులు .
యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న NBK107 ఫస్ట్ హంట్ లోడింగ్.. అంటూ బాలకృష్ణ చేతులను మాత్రమే చూపిస్తున్న పోస్టర్ తో జూన్ 10 న పవర్ ఫుల్ అప్ డేట్ రాబోతుంది అంటూ టీమ్ ప్రకటించింది. ఈ అప్ డేట్ తో బాలయ్య ఫాన్స్ అలెర్ట్ అయ్యారు. NBK107 అప్ డేట్ ఎలా ఉంటుందో.. టైటిల్ ప్రకటిస్తారా? లేదంటే టీజర్ ఇస్తారా? అంటూ ఫాన్స్ తమలో తామే చర్చలు మొదలు పెట్టేసారు. ఈ సినిమాలో బాలయ్య కి జోడిగా శృతి హాసన్ నటిస్తుండగా.. కన్నడ దునియా విజయ్ బాలయ్య తో ఫైట్ చెయ్యబోతున్నారు. వరలక్ష్మి శరత్ కుమార్ పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతుంది.