Advertisementt

ఫిలిం ఫేర్ పై రష్మిక అందాలు

Mon 06th Jun 2022 04:11 PM
rashmika,filmfare,filmfare magazine,rashmika mandanna,krashmika  ఫిలిం ఫేర్ పై రష్మిక అందాలు
Rashmika Mandanna glamour look in Filmfare magazine ఫిలిం ఫేర్ పై రష్మిక అందాలు
Advertisement
Ads by CJ

బాలీవుడ్ లోకి అడుగుపెట్టేసరికే గ్లామర్ గా విశ్వరూపం చూపించిన రష్మిక, అక్కడ వరస ప్రాజెక్ట్స్ ఓకె చేసినప్పటినుండి పర్ఫెక్ట్ జిమ్ గర్ల్ గాను, గ్లామర్ గర్ల్ గాను మారిపోయింది. నేషనల్ క్రష్ రశ్మికని క్రష్మిక అంటున్నారు. నిన్నగాక మొన్న కరణ్ జోహార్ బర్త్ డే పార్టీలో తన గ్లామర్ డ్రెస్ గురించి అందరూ మాట్లాడుకునేలా చేసింది. బాలీవుడ్ నీళ్లు బాగా ఒంట పట్టించుకున్న రష్మిక.. సౌత్ లోను చెలరేగిపోతుంది. అల్లు అర్జున్ తో పాన్ ఇండియా మూవీ, విజయ్ తో Thalapathy66 లో నటిస్తున్న రష్మిక ఇప్పుడు ఓ ప్రముఖ మ్యాగజైన్ కవర్ పేజీ పై కి ఎక్కింది.

ఫిలిం ఫేర్ మ్యాగజైన్ జూన్ ఎడిషన్ పై రష్మిక గ్లామర్ గా కనిపించింది. అభిమానులంతా క్రష్మిక అని ముద్దుగా పిలిచే రష్మిక మందన్న ఇండియన్ సినిమా ఇండస్ట్రీ(నార్త్, సౌత్) లో నెంబర్ వన్ హీరోయిన్ గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుని, చాలా తక్కువ టైం లో పేరు తెచ్చుకున్న రష్మిక మందన్న ని మా జూన్ డిజిటల్ కవర్ పై చూపిస్తున్నాం అంటూ ఫిలిం ఫేర్ మ్యాగజైన్ వారు రష్మిక గ్లామర్ పిక్ ని పోస్ట్ చేసారు. ఆరెంజ్ కలర్ టాప్ వేసుకుని అందాలను అందంగా ప్రదర్శిస్తూ లూజ్ హెయిర్ తో, రెండు చేతులు ప్యాంటు జేబులో పెట్టుకుని పదునైన చూపులతో హీటేక్కిస్తున్న రష్మిక ఫిలిం ఫేర్ లుక్ మీ కోసం..

Rashmika Mandanna glamour look in Filmfare magazine:

Rashmika goes glamour on the cover page of Filmfare

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ