బాలకృష్ణ తన కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం గ్రౌండ్ వర్క్ చెయ్యడమే కాదు తన కొడుకు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ మూవీకి దర్శకుడుని కూడా ఫైనల్ చేశారనే టాక్ గౌతమీపుత్ర శాతకర్ణి అప్పటినుండి వినిపిస్తూనే ఉంది. అప్పట్లో క్రిష్ మోక్షజ్ఞ డెబ్యూ డైరెక్టర్ అన్నారు. తర్వాత పూరి జగన్నాధ్ ఆల్మోస్ట్ కన్ ఫర్మ్ అనే టాక్ నడిచింది. ఇప్పుడు సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మోక్షజ్ఞ ని తెరకు పరిచయం చెయ్యబోతున్నాడు, బాలకృష్ణ స్వయంగా అనిల్ రావిపూడి చేతిలో మోక్షజ్ఞని పెట్టారని అంటున్నారు. కానీ మోక్షజ్ఞ ఇంకా హీరో గా చెయ్యడానికి రెడీగా లేడని అతని ఫిజిక్ చూస్తే తెలుస్తుంది. కానీ సోషల్ మీడియా ప్రచారానికి హద్దు అదుపు లేదు.
అయితే అనిల్ రావిపూడి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై అదిరిపోయే రిప్లై ఇచ్చారు. F3 తర్వాత బాలకృష్ణ తో మూవీ చేయబోతున్నాను. మోక్షజ్ఞ ని సిల్వర్ స్క్రీన్ కి ఇంట్రడ్యూస్ చేయబోతున్నట్లుగా వస్తున్న వార్తలు నా వరకు వచ్చాయి. నన్ను చాలామంది అడిగారు. మోక్షజ్ఞ మూవీ గురించి బాలయ్య గారు నాతో ఎప్పుడూ మాట్లాడలేదు. ప్రస్తుతానికి నా ఫోకస్ మొత్తం బాలయ్య గారితో చేసే సినిమాపైనే ఉంది. ఒకవేళ ఆయన మోక్షజ్ఞని పరిచయం చేయమంటే కచ్చితంగా చేస్తాను. కానీ, బాలయ్య గారు ఎలాంటి ప్లాన్‌లో ఉన్నారో నాకు తెలీదు అంటూ అనిల్ రావిపూడి మోక్షజ్ఞ ని డైరెక్ట్ చేసే విషయంలో ఫుల్ క్లారిటీ ఇచ్చాడు.