ఇప్పుడు ఇండస్ట్రీలో అసలేం జరుగుతుందో సామాన్య ప్రేక్షకుడికి అర్ధం కాని పరిస్థితి. అంటే సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయ్యాక టికెర్ రేట్స్ ఎక్కువ పెట్టి కొనాలా? లేదంటే పాత రేట్లే ఉంటాయా? ఈ సినిమా రిలీజ్ అయ్యాక రెండు వారాలకే ఓటిటిలో వస్తుంటే థియేటర్స్ కి ఎందుకు వెళ్లడం? ఒకవేళ 50డేస్ వరకు రాకపోతే ఎంటర్టైన్మెంట్ మిస్ అవుతాం? లాంటి కన్ఫ్యూజన్ లో ప్రేక్షకులు ఉంటున్నారు. కొన్ని భారీ బడ్జెట్, పాన్ ఇండియా మూవీస్ రిలీజ్ అయినప్పుడు టికెట్ రేట్స్ అమాంతం పెరిగిపోతున్నాయి. దానితో చిన్న సినిమాలు విడుదలైనప్పుడు థియేటర్స్ కి వెళ్లాలంటే ఆడియన్స్ ఆలోచనలో పడిపోతున్నారు.
అందుకే చాలామంది హీరోలు మా సినిమాకి టికెట్ రేట్స్ తగ్గించాం అని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పుకోవాల్సిన అగత్యం ఏర్పడింది. అంతేకాదు మా సినిమా ఓ ఎనిమిదివారాల వరకు ఓటిటిలో రిలీజ్ చెయ్యం థియేటర్స్ లోనే చూడండి అని కూడా మొత్తుకోవాల్సి వస్తుంది. మొన్నటికి మొన్న F3 కి టికెట్ రేట్స్ తగ్గించాం, మా సినిమా ఎనిమిది వారాల తర్వాతే ఓటిటిలోకి వస్తుంది. థియేటర్స్ లోనే సినిమా చూడమని దిల్ రాజు నెత్తినోరు బాదుకున్నారు. అలాగే అల్లు అరవింద్ కూడా పక్కా కమర్షియల్ ప్రెస్ మీట్ లో తక్కువ టికెట్ రేట్ కే ప్రేక్షకులకి అందుబాటులో పక్కా కమర్షియల్ అన్నారు. ఇక అడివి శేష్ అలానే మేజర్ కి తక్కువ టికెట్ ధరలంటూ ప్రెస్ మీట్ పెట్టాడు.
ఇప్పుడు అంటే సుందరానికి సినిమా ప్రమోషన్స్ లో నాని అదే చెప్పుకుంటున్నాడు. తాజాగా నాని ఇంటర్వ్యూలో
1 అంటే సుందరానికి సినిమాలో కామిడి వెరైటీగా వుంటుంది
2 టిక్కెట్ రేట్లు విషయం లో తక్కువ లో వద్దు. పాత రేట్లు వుంచమని అడిగాను. అంతే కాని మళ్ళీ అదే రేటు అంటే పాత రేట్లు కోనసాగిస్తున్నారు ఓకే.
3 సినిమా కి గోల్డెన్ ఫెస్ అని చెప్పాలి ఇప్పుడు అన్ని సినిమాలు ఇండియా మొత్తం రిలీజ్ అవుతున్నాయి.
4 ఈ సినిమా ఓటిటి లో వెంటనే అంటే జులైలో రాదు తరువాతనే వస్తుంది.
5 పాన్ ఇండియా సినిమా అని మనం అనుకుంటే సరిపోదు. జనం అనుకోవాలి. జనం అలా అనుకుంటే అదే పాన్ ఇండియా సినిమా.. అంటూ చెప్పడం చూసాక.. ఆఖరికి హీరోలు ఇలా చెప్పుకోవాల్సిన దుస్థితిలో ఉంది ఇండస్ట్రీ అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు..