షారుఖ్ ఖాన్ చాలా రోజుల తర్వాత ఓ పవర్ ఫుల్ కమర్షియల్ ఎంటర్టైనర్ లో కనిపించబోతున్నారు. తమిళ అగ్ర దర్శకుడు అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ జవాన్ మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీ టైటిల్ అండ్ ఫస్ట్ టీజర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. షారుఖ్ ఖాన్ జవాన్ లుక్ ఫాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో నయనతార హీరోయిన్ అని చెబుతున్నా హీరోయిన్ విషయమై ఎక్కడా ఇన్ ఫర్మేషన్ లేదు. అయితే గత ఏడాది కొడుకు జైలు పాలవడంతో షారుఖ్ నటిస్తున్న సినిమాల షూటింగ్ కి లాంగ్ బ్రేక్ ఇచ్చారు షారుఖ్ అన్నారు.
ఇక ఇప్పుడు షారుఖ్ ఖాన్ కరోనా బారిన పడడంతో రీసెంట్ గానే మొదలైన జవాన్ షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారని తెలుస్తుంది. బాలీవుడ్ లో నిన్న ఒక్కసారిగా కరోనా కలకలం కనిపించింది. అగ్రతారలైన కత్రినా కైఫ్, షారుఖ్ ఖాన్ లు కరోనా బారిన పడడంతో వీరితో పాటుగా కరణ్ జోహార్ పార్టీలో పాల్గొన్న సెలబ్రిటీస్ అంతా కోవిడ్ టెస్ట్ లకి పరిగెత్తినట్లుగా, అందులో ఓ 50 నుండి 55 మందికి కరోనా సోకినట్లుగా బాలీవుడ్ మీడియాలో కథనాలు ప్రసారం అయ్యాయి. ఇక షారుఖ్ హోమ్ ఐసోలేషన్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని, కాబట్టి జవాన్ షూటింగ్ తాత్కాలికంగా వాయిదా పడింది అని తెలుస్తుంది.