అనిల్ రావిపూడి నవ్వుల ఫ్రాంచైజీ F2 లో హీరోలుగా వెంకటేష్, వరుణ్ తేజ్ లు, హీరోయిన్స్ గా తమన్నా, మెహ్రీన్ కౌర్ లు నటించారు. ఆ సినిమా హిట్ అవడంతో దానికి సీక్వెల్ గా F3 తెరకెక్కించిన అనిల్ రావిపూడి హీరోలుగా, హీరోయిన్స్ గా వెంకీ, వరుణ్, తమన్నా, మెహ్రీన్ లనే కంటిన్యూ చేసారు. అలాగే F3 లో సోనాల్ చౌహన్ అందాలను యాడ్ చేసారు. ఆ సినిమా కూడా హిట్ అవడంతో మళ్లీ F4 పై దృష్టి పెట్టారు అందరూ. కానీ అనిల్ రావిపూడి మాత్రం ఇప్పట్లో F4 రాకపోవచ్చు. F2 హిట్ కాబట్టి F3 తీసాం. F3 హిట్ అయ్యింది కాబట్టి F4 చేద్దామనుకుంటున్నాం కానీ అది ఎప్పుడు పట్టాలెక్కుతుందో చెప్పలేమని చెప్పారు.
అలాగే మళ్లీ హీరోలని, హీరోయిన్స్ ని F4 లో కంటిన్యూ చేస్తారా అని అడిగితే.. దానికి అనిల్ రావిపూడి హీరోలు కంటిన్యూ అవ్వొచ్చు, అలాగే కొంతమంది హీరోలు యాడ్ అవ్వొచ్చు. కానీ హీరోయిన్స్ కంటిన్యూ అనే విషయం చెప్పలేనని చెబుతున్నారు. అంటే అనిల్ రావిపూడి F3 ప్రమోషన్స్ విషయంలో తమన్నా తో వచ్చిన తో విభేదాల కారణంగానే F4 లో హీరోయిన్స్ ని కంటిన్యూ చెయ్యమని చెప్పారా? లేదంటే కొత్తదనం కోసం హీరోయిన్స్ ని కంటిన్యూ చెయ్యరా? అనేది మాత్రం కాస్త సుస్పెన్స్ అనే చెప్పాలి. ఏది ఏమైనా F3 కి కంటిన్యూషన్ F4 ఉంటుంది ఇది ఫిక్స్ అంటున్నారు అనిల్ రావిపూడి తాజా ఇంటర్వ్యూ లో.