కియారా అద్వానీ ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయిన హీరోయిన్. ఎందుకంటే గత కొన్నాళ్లుగా బాలీవుడ్ కి హిట్ అన్నదే పడడం లేదు. ఈమధ్యనే కియారా అద్వానీ - కార్తీక్ ఆర్యన్ నటించిన భూల్ భులైయా 2 హిట్ అవడంతో అందరూ ఆ సినిమా గురించి ఆ సినిమాలో నటించిన వారి గురించే మాట్లాడారు. ఇక ఇటు తెలుగు, తమిళ, హిందీ లాంగ్వేజెస్ లో తెరకెక్కుతున్న RC15 లో రామ్ చరణ్ సరసన నటిస్తుంది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కి ప్రస్తుతానికి బ్రేక్ ఇచ్చారు. అలా తెలుగు, బాలీవుడ్ మూవీస్ తో బిజీగా వున్న కియారా కి మరో సౌత్ ఆఫర్ తగిలినట్లుగా తెలుస్తుంది.
ఆ ఆఫర్ కూడా కోలీవుడ్ లో శివ కార్తికేయన్ హీరోగా మడోన్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో కియారా అద్వానీని హీరోయిన్ గా సంప్రదించారని, కియారా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. కియారా హీరోయిన్ గా ఫైనల్ అన్న విషయాన్ని టీం ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మరోపక్క కియారా అద్వానీ పేరు NTR30 కోసం కూడా వినిపిస్తుంది.