రాధే శ్యామ్, ఆచార్య రిలీజ్ అయిన రెండు వారాలకే ఆ సినిమాలు ఓటిటిలోకి వచ్చేసాయి. రాధే శ్యామ్, ఆచార్య మాదిరిగా మహేష్ బాబు సర్కారు వారి పాటని రెండు రోజుల క్రితమే ఎర్లీ ప్రీమియర్స్ అంటూ ఓటిటిలోకి వదిలేసారు. ఎర్లీ ప్రీమియర్స్ అయితేనేమిటి, మాములుగా ఓటిటిలో వదిలితేనేమి.. ఇలా రెండు వారాల గ్యాప్ తో పెద్ద సినిమాలను ఓటిటిలో రిలీజ్ చేసేస్తుంటే.. ప్రజలకు, ప్రేక్షకులకి మీరు చెబుతుంది ఏమిటి?.
సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయ్యాక మీరు డబ్బులు తగలేసుకుని థియేటర్స్ కి వెళ్లాల్సిన పనేం లేదు, పది పదిహేను రోజుల్లో మీ ఇంట్లోకే సినిమా వచ్చేస్తుంది అంటూ ఇండైరెక్ట్ గా పబ్లిసిటీ చేస్తున్నట్టే. చేజేతులా చేసుకుంటున్నారు. సినిమా విలువని దిగజారుస్తున్నారు. ఈరోజు ఆడియన్స్ థియేటర్స్ కి వెళ్లి అంత టికెట్ ప్రైస్ పెట్టి సినిమా చూసెయ్యాలనే ఆశక్తి సన్నగిల్లిపోతుంది. ఎవ్వరికీ థియేటర్స్ కి వెళ్లి సినిమా చూడాలనే ఇంట్రెస్ట్ లేదు. ఏదో హీరోల మీద ప్రేమ ఉన్న ఫాన్స్ అయితే థియేటర్స్ కి వెళ్లి సినిమా చూస్తారు. అంతేతప్ప కామన్ ఆడియన్స్ థియేటర్ కి కదలడం లేదు. ఒకప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కి రావడం లేదు అని టివి సీరియల్స్ వంక చూపించేవారు. ఇప్పుడు ఏ ఆడియన్స్ థియేటర్ కి రావడం లేదు. వంక చూపించుకోవాల్సింది ఓటిటి వైపే.
చేజేతులా చేసుకుంటున్నారు. ఎవ్వరూ రావడం లేదు, రారు కూడా. పది రోజులు పొతే ఫ్రీగా చూసుకుందాంలే అనుకుంటారు. చచ్చిపోతుంది సినిమా మర్కెట్.