మహేష్ నిర్మాణ సంస్థ నుండి పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన మేజర్ మూవీ కి బ్లాక్ బస్టర్ టాక్ రావడమే కాదు, బాలీవుడ్ నుండి బ్లాక్ బస్టర్ రివ్యూస్ కూడా వచ్చాయి. హీరో అడివి శేష్ మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ కేరెక్టర్ లో ఒదిగిపోవడం, శశి కిరణ్ తిక్క దర్శకత్వం, క్లైమాక్స్ సన్నివేశాలు మేజర్ కి ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి. అటు విమర్శకుల ప్రశంశల తో పాటుగా ఇటు కలెక్షన్స్ వర్షం కురిపిస్తున్న మేజర్ మూవీ ని రీసెంట్ గా అల్లు అర్జున్ వీక్షించి మేజర్ మూవీ ని తెరకెక్కించిన మహేష్ బాబు కి సెల్యూట్ చేసాడు. అడివి శేష్ నటనని పొగిడేసాడు.
అల్లు అర్జున్ ట్వీట్ కి మహేష్ బాబు కూడా తనదైన స్టయిల్లో స్వీట్ రిప్లై ఇచ్చారు. అల్లు అర్జున్ మేజర్ మూవీ చూసి టీం ని అభినందించినందుకు థాంక్స్.. నీ ట్వీట్ యంగ్ టీం కి చాలా ఉత్సాహాన్ని అందిస్తుంది. నీకు ఈ సినిమా నచ్చినందుకు నాకు చాలా హ్యాపీ గా ఉంది అంటూ రిప్లై ఇవ్వడం అటు అల్లు ఫాన్స్ లోను, ఇటు మహేష్ బాబు ఫాన్స్ లోను జోష్ ని నింపింది.