గత రెండేళ్లుగా బాలీవుడ్ లో ఓ అని చెప్పుకునేంతగా పార్టీలు ఏమి జరగలేదు. ఎందుకంటే కరోనా ప్రభావంతో గ్రాండ్ గా జరిగే పార్టీలు సైలెంట్ అయ్యాయి. గత ఏడాది కరణ్ జోహార్ ఇంట్లో సీనియర్ హీరోయిన్స్ అంతా నైట్ పార్టీలో పాల్గొనగా అప్పట్లో కొంతమంది కరోనా బారిన పడడం హాట్ టాపిక్ అయ్యింది. కానీ కరణ్ జోహార్ తన పార్టీ వలన ఎవరూ కరోనా బారిన పడలేదు అని చెప్పారు. ఇప్పుడు తాజాగా కరణ్ జోహార్ బర్త్ డే పార్టీకి హాజరైన వారిలో 55 మంది కరోనా బారిన పడ్డారు అంటూ బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. గత నెల 25 న కరణ్ జోహార్ ముంబై లోని యశ్ రాజ్ స్టూడియోస్ లో తన పుట్టిన రోజు పార్టీ ఇచ్చారు. ఈ పార్టీకి సౌత్ నుండి విజయ్ దేవరకొండ, రష్మిక, పూరి, ఛార్మి, బాలీవుడ్ బడా హీరోస్ షారుఖ్, సల్మాన్, రాణి ముఖర్జీ, ఐశ్వర్య రాయ్, అభిషేక్, కరీనా -విక్కీ కౌశల్, పూజ హెగ్డే లాంటి టాప్ స్టార్స్ పాల్గొన్నారు.
అక్కడ పార్టీకి హాజరైన వారంతా కరణ్ జోహార్ తో ఫొటోస్ దిగగడం, అలాగే పార్టీలో కరణ్ తో కలిసి కొంతమంది సెలబ్రిటీస్ స్టేజ్ పై డాన్స్ చేసిన వీడియోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇప్పుడు చూస్తే పార్టీకి హాజరైన 50 నుంచి 55 మంది గెస్ట్ లు ముఖ్యంగా షారుఖ్, కత్రినా కైఫ్ కోవిడ్ బారిన పడినట్లుగా చెబుతున్నారు. అయితే కొంతమంది తమకి కరోనా సోకినట్లుగా బయటికి చెప్పడం లేదంటూ ప్రచారం స్టార్ట్ అయ్యింది. కరణ్ జోహార్ నుండి ఈ విషయమై ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం కరణ్ స్పందనకై బాలీవుడ్ మీడియా వేచి చూస్తుంది.