Advertisementt

జబర్దస్త్: ఒంటరి ఫీలింగ్ లో రామ్ ప్రసాద్

Sun 05th Jun 2022 12:10 PM
jabardasth,extra jabardasth,ram prasad,sudigali sudheer,srinu  జబర్దస్త్: ఒంటరి ఫీలింగ్ లో రామ్ ప్రసాద్
Jabardasth: Ram Prasad in feeling lonely జబర్దస్త్: ఒంటరి ఫీలింగ్ లో రామ్ ప్రసాద్
Advertisement
Ads by CJ

జబర్దస్త్ కామెడీ షో కి కష్ట కాలం మొదలైంది. మల్లెమాల జబర్దస్త్ షో స్టార్ట్ చేసాక ఎదురు లేకుండా సక్సెస్ ఫుల్ కామెడీ షో లకి రారాజుగా వెలిగిన జబర్దస్త్ లో ఇప్పుడు కమెడియన్స్ కరువయ్యారు, కామెడీ కరువయ్యింది. కొత్త కొత్త మొహాలతో జబర్దస్త్ ని మమ అనిపిస్తున్నారు. గురువారం జబర్దస్త్ లో హైపర్ ఆది టీం ఎగిరిపోయింది. అది జబర్దస్త్ కి బై బై చెప్పేసాడు. ఇక ఎక్స్ట్రా జబర్దస్త్ లో సుడిగాలి సుధీర్ టీం మిస్సింగ్. గత కొన్ని వారాలుగా సుధీర్, శ్రీను జబర్దస్త్ కి హ్యాండ్ ఇస్తున్నారు. దానితో రామ్ ప్రసాద్ ఒంటరిగా వేరే కమెడియన్స్ తో స్కిట్స్ చేస్తున్నాడు. ఈ వారం రష్మీ పెళ్లి అంటూ ఏదో కామెడీ చెయ్యగా వచ్చే వారం రాకింగ్ రాకేష్ - కెవ్వు కార్తీక్ కలిసి రామ్ ప్రసాద్-సుధీర్-శ్రీనుల ఫ్రెండ్ షిప్ స్కిట్ చేసారు. ఆ స్కిట్ వస్తున్నంతసేపు రామ్ ప్రసాద్ కన్నీరు పెడుతూనే ఉన్నాడు.

తర్వాత జేడ్జ్ ఇంద్రజ మీ టీం కి ఎవరి దిష్టి తగిలిందో అంటూ ఎమోషనల్ అవ్వగా.. అవును మేడం ఫస్ట్ టైం ఒంటరి అనే ఫీలింగ్ వస్తుంది అంటూ ఏడ్చేశాడు. సుధీర్ - శ్రీను ఒక్కసారిగా దూరమవ్వడంతో రామ్ ప్రసాద్ ఒంటరిగా జబర్దస్త్ స్టేజ్ పై మిగిలాడు. సుధీర్ హీరోగా, స్టార్ మా లో యాంకర్ గా కనిపిస్తున్నాడు. అలాగే శ్రీను రాజు భాయ్ మూవీతో పాటుగా ఇతర సినిమాల్లో కమెడియన్ గా బిజీ అయ్యాడు. అందుకే వీరిద్దరూ జబర్దస్త్ కి దూరం కాగా.. రామ్ ప్రసాద్ కి ఈ జబర్దస్త్ మాత్రమే దిక్కు కావడంతో ఒంటరిగా పోరాడుతున్నాడు.

Jabardasth: Ram Prasad in feeling lonely:

Extra Jabardasth:  Ram Prasad became lonely

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ