ఖైదీ, మాస్టర్ చిత్రాలతో స్టార్ డైరెక్టర్ గా మారిన లోకేష్ కనగరాజ్ లేటెస్ట్ గా కమల్ హాసన్-విజయ్ సేతుపతి-ఫహద్ ఫాసిల్ కలయికలో తెరకెక్కించిన విక్రమ్ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు తగినట్లుగా విక్రమ్ ని ఆడియన్స్ ఆదరిస్తున్నారు. ఫుల్ ఆన్ యాక్షన్ గా తెరకెక్కిన విక్రమ్ సినిమాలో కమల్, ఫహద్ ఫాసిల్ పెరఫార్మెన్స్ ని అందరూ మెచ్చుకుంటున్నారు. సినిమా అంతా ఒక ఎత్తు ఈ సినిమాలో క్యామియో రోల్ చేసిన సూర్య కేరెక్టర్ ఒక ఎత్తు అన్నట్టుగా ఉంది ఆడియన్స్ రెస్పాన్స్.
సూర్య విక్రమ్ మూవీలో కనిపించింది చాలా తక్కువ సమయమే కానీ.. సూర్య లుక్, ఆయన కేరెక్టర్ ఆడియన్స్ కి బాగా నచ్చేసింది. సూర్య క్యామియో రోల్ తో ఇక సినిమా వేరే లెవెల్ అన్నట్టుగా మారింది. రోలెక్స్ గా సూర్య ఎంత పవర్ ఫుల్ గా కనిపించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చిన్నపాటి కేరెక్టర్, కొద్దిపాటి పెరఫార్మెన్స్ కి థియేటర్స్ లో విజిల్స్ పడ్డాయి, సోషల్ మీడియాలోనూ రోలెక్స్ అంటూ ట్రెండ్ చేస్తున్నారు. అలాంటి రోల్ కి సూర్య ఎంత పారితోషకం తీసుకుని ఉంటాడనే విషయంలో చర్చ మొదలైంది. కానీ కమల్ అడిగారని ఒకే ఒక్క కారణంగా సూర్య అలా వచ్చి ఇలా ఆ కేరెక్టర్ ని ఫినిష్ చేసి సింగిల్ పైసా ఛార్జ్ చెయ్యకుండా వెళ్ళిపోయినట్లుగా తెలుస్తుంది. ఇది తెలిసిన ఫాన్స్ సూర్య వ్యక్తిత్వాన్ని, ఆయన గొప్పదనాన్ని తెగ పొగిడేస్తున్నారు.