F3 రిలీజ్ కి ముందు తమన్నా F3 ప్రమోషన్స్ లో మెరిసింది. ఆ తర్వాత ఆమెకి కేనస్ ఫిలిం ఫెస్టివల్ కి ఆహ్వానం రావడంతో అటు వెళ్ళిపోయింది. తర్వాత మళ్ళీ F3 ప్రమోషన్స్ లో కనిపించలేదు. ఆ తర్వాత F3 రిలీజ్ కి ముందే వచ్చినా ఆమె ప్రమోషన్స్ కి రాలేదు. దానితో తమన్నాకి కోపం వచ్చింది అందుకే ప్రమోషన్స్ కి రావడం లేదు అన్నారు. మెహ్రీన్ కౌర్, సోనాల్ చౌహన్ లు F3 ప్రమోషన్స్ కి వద్దన్నా వచ్చేశారా అన్నట్టుగా పాల్గొన్నారు. బుల్లితెర షోస్ క్యాష్, ఢీ డాన్స్ షో, స్టార్ మా కామెడీ స్టార్స్, బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే స్టేజ్ పై ఇలా అనిల్ రావిపూడి హీరోయిన్స్ ని వెంటేసుకుని దేనిని వదల్లేదు. మెహ్రీన్ కౌర్ సోలో ఇంటర్వ్యూ.. ఇలా సినిమా విడుదలయ్యేవరకు హీరోయిన్స్ మీడియాకి దగ్గరగానే ఉన్నారు.
అదేమిటో F3 విడుదలైంది.. ఆ తర్వాత హీరోయిన్స్ కనబడితే ఒట్టు. మెహ్రీన్ కౌర్ కానీ, సోనాల్ చౌహన్ కానీ, తమన్నా కానీ ముగ్గురిలో ఎవ్వరూ పోస్ట్ ప్రమోషన్స్ లో కనిపించింది లేదు. F3 సక్సెస్ రైడ్ లో కనిపించలేదు, వీడియో బైట్స్ లోను కనిపించలేదు. ఈ రోజు జరిగిన F3 ట్రిపుల్ బ్లాక్ బస్టర్ ఫంటాస్టిక్ సెలెబ్రేషన్స్ లోను కనిపించలేదు. కేవలం వెంకటేష్, వరుణ్ తేజ్ లు మాత్రమే F3 సక్సెస్ ప్రమోషన్స్ లో కనిపిస్తున్నారు. ఇదే విచిత్రంగా ఉంది. హీరోయిన్స్ ని అనిల్ రావిపూడి సినిమాలో బాగానే చూపించాడు. ప్రమోషన్స్ లో మంచి స్పేస్ ఇచ్చాడు. కానీ F3 పోస్ట్ ప్రమోషన్స్ లో హీరోయిన్స్ కనిపించకపోవడంపై రకరకాల అనుమానాలు ఆడియన్స్ లో కలుగుతున్నాయి. తమన్నా రాకపోయినా.. మెహ్రీన్ కౌర్, సోనాల్ లు వచ్చేవారు కానీ అక్కడే డౌట్ కొడుతోంది.