ఈ శుక్రవారం నిజంగా బాక్సాఫీసుకి కళని తీసుకువచ్చింది. కలెక్షన్ల గలగలలు వినిపించింది. ఒకవైపు మేజర్, రెండో వైపు విక్రమ్. రెండు సినిమాలకి పాజిటివ్ టాక్ రావడం, రెండు సినిమాలకి మంచి కలెక్షన్స్ రావడం, రెండు సినిమాలు హౌస్ ఫుల్స్ తో వెళ్లడం, నిజంగా టాలీవుడ్ ఇండస్ట్రీకి కొత్త ఊపిరినిచ్చింది అని చెప్పాలి. ఒకటి స్ట్రయిట్ సినిమా. మరొకటి డబ్బింగ్ సినిమా, రెండిటిని ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులు థియేటర్స్ కి కదిలి రావడం దర్శకనిర్మాతల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. అయితే బయోపిక్ గా రూపొందిన మేజర్ ప్రసంశలు ఎక్కువగా అందుకుంటున్నప్పటికీ.. కలెక్షన్స్ విషయంలో మాత్రం కాస్త వెనకడుగులోనే ఉంది.
కమర్షియల్ అంశాలతో తెరక్కేక్కిన విక్రమ్ అన్నిచోట్లా దూసుకుపోతుంది. విక్రమ్ సినిమా 10 నుండి 15 కోట్ల కలెక్షన్స్ కొల్లగొడుతుంది అని ఎస్టిమేషన్ వేస్తున్న ట్రేడ్ అనలిస్ట్ లు మేజర్ విషయంలో మాత్రం ఏ లెక్కలూ చెప్పలేకపోతున్నారు. ప్రస్తుతానికైతే ఈరోజు శనివారం మార్నింగ్ షో, మ్యాట్నీ రెండిటిని కరెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తున్న రెండు సినిమాలు ఫస్ట్ షో, సెకండ్ షో రెండు ఆటలు హౌస్ ఫుల్స్ అయ్యిపోయాయి. సండే చెప్పాల్సిన పనిలేదు. అడ్వాన్స్ బుకింగ్స్ లో ఉన్నాయి. బట్ మండే రోజు మాత్రం నిలబడేది కరెక్ట్ సినిమానా? కమర్షియల్ సినిమానా? అనేది చూడాలి. మన ఆడియన్స్ ఏ సినిమాని ఆదరిస్తారు. కమర్షియల్ అంశాల వైపు మొగ్గు చూపుతారా? ఎథికల్ గా మేజర్ ని సపోర్ట్ చేస్తారా? అనేది మండే తేలిపోతుంది.