హౌస్ ఫుల్, హౌస్ ఫుల్ అంటూ థియేటర్స్ దగ్గర ఈ సమయంలో ఏ సినిమాకి బోర్డ్స్ కనిపిస్తున్నాయ్ అనుకుంటున్నారు. మేజర్ మూవీ కి. అడివి శేష్ హీరోగా మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ బయోపిక్ గా శశి కిరణ్ టిక్కా తెరకెక్కించిన మేజర్ మూవీ థియేటర్స్ దగ్గర హౌస్ ఫుల్ బోర్డ్స్ తో ప్రేక్షకుల సందడితో కళకళలాడుతున్నాయి. హా మేజర్ హిట్ అయినా ప్రేక్షకులు పెద్దగా ఈ సినిమాని చూసేందుకు ఇష్టపడరు. కలెక్షన్స్ రావు అనుకున్నారు చాలామంది. కానీ ఇండియా వైడ్ గా నాలుగు భాషల్లో రిలీజ్ అయిన మేజర్ మూవీ విడుదలకు ముందే స్పెషల్ ప్రీమియర్స్ తో సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని క్రిటిక్స్ తో శెభాష్ అనిపించుకుంది.
కేవలం మల్టిప్లెక్స్ ఆడియన్స్ మాత్రం మేజర్ మూవీ ని వీక్షించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారని అన్నా.. ఇప్పుడు అన్ని రకాల ఆడియన్స్ మేజర్ మూవీ కి క్యూ కడుతున్నారు. బుక్ మై షో లో మేజర్ మూవీ టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఈ వీకెండ్ లో మేజర్ టికెట్స్ దొరకడం కష్టంగా మారింది. మేజర్ సినిమా విడుదలైన ప్రతి భాషలో విమర్శకుల ప్రసంశలు అందుకుంది. బాలీవుడ్ వెబ్ సైట్స్ కూడా యునానమస్ గా మేజర్ మూవీ ని పొగుడుతూ రివ్యూ, రేటింగ్స్ ఇచ్చేసాయి. మహేష్ బాబు అంచనా తప్పలేదు, ఆయన గెస్ కరెక్ట్ అయ్యింది,. మేజర్ ప్రౌడ్ మూవీ అంటూ ఆడియన్స్ నోటి వెంట ఒకటే మాట. అందుకే మేజర్ థియేటర్స్ హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి.