ఈ మధ్యన సినిమా ఫంక్షన్స్ లో హీరోలు స్టేజ్ పైకి ఎక్కి డాన్స్ చెయ్యడం ఓ ట్రెండ్ గా మారిపోయింది. అయితే ఎప్పుడు ఏ హీరో చేసినా పెద్దగా హైలెట్ అవ్వని హీరోల డాన్స్ లు.. మహేష్ బాబు సర్కారు వారి పాట సక్సెస్ సెలెబ్రేషన్స్ లో మాస్ సాంగ్ కి స్టెప్స్ వేస్తే అది సెన్సేషనల్ అయ్యింది. అంటే ఎప్పుడూ డీసెంట్ గా ఉండే మహేష్ బాబు ఆ సాంగ్ ప్లే అవుతుంటే.. సడన్ గా లేచి స్టేజ్ ఎక్కేసి థమన్, డాన్సర్స్ తో కలిసి డాన్స్ చెయ్యడం సంచలనంగా మారింది. తనకి తెలియకుండానే అలా ఫాన్స్ కోసం డాన్స్ చేశా అంటూ మహేష్ చెప్పినా అది ఇప్పటికి ఆయన ఫాన్స్ కి ఫుల్ ట్రీట్ గానే ఉంది. అయితే ఇప్పుడు అల్లు అరవింద్ గారు ఇండైరెక్ట్ గా మహేష్ బాబు స్టేజ్ పై డాన్స్ విషయాన్ని మాట్లాడారు.
బన్నీ వాస్ నిర్మాణంలో మారుతి దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా తెరకెక్కిన పక్కా కమర్షియల్ ప్రెస్ మీట్ అల్లు అరవింద్ మట్లాడుతూ.. సినిమా ప్రమోషన్స్ ని చాలా డిఫ్రెంట్ గా నిర్వహిస్తేనే ఆడియన్స్ లో ఆసక్తి కలుగుతుంది. ఈ మధ్యన ఓ పెద్ద హీరో ఆయన సినిమా ప్రమోషన్స్ కోసం స్టేజ్ పై డాన్స్ చేసాడు. ఇకపై అందరు హీరోలు సినిమాలను అలా ప్రమోట్ చేయాలి అంటూ అల్లు అరవింద్ పక్కా కమర్షియల్ ప్రెస్ మీట్ స్టేజ్ పై సెన్సేషనల్ గా మట్లాడారు.