Advertisementt

షారూఖ్ ఖాన్-అట్లీ జవాన్ టీజర్

Fri 03rd Jun 2022 07:14 PM
bollywood baadshah,shah rukh khan,atlee,red chillies entertainment,pan india film jawan,jawan first look  షారూఖ్ ఖాన్-అట్లీ జవాన్ టీజర్
Pan India Film JAWAN First Look Unveiled షారూఖ్ ఖాన్-అట్లీ జవాన్ టీజర్
Advertisement
Ads by CJ

షారూఖ్ ఖాన్ హీరోగా బ్లాక్ బస్టర్ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో జవాన్ టైటిల్ తో భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను ప్రకటించింది. అత్యున్నత స్థాయి తారాగణం, సాంకేతిక నిపుణులతో భారీ యాక్షన్ సీక్వెన్సులు గల ఈ పాన్ ఇండియా చిత్ర యావత్ సినీ ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్టైన్ ఇవ్వబోతుంది. సౌత్ లో రాజా రాణి, థేరి, మెర్సల్, బిగిల్ వంటి విజయవంతమైన బ్లాక్‌బస్టర్ చిత్రాలకు దర్శకత్వం వచించిన అట్లీ .. ఇపుడు భారీ అంచనాలన్న జవాన్ తో తన మ్యాజిక్‌ను దేశ వ్యాప్తంగా చూపించబోతున్నారు  

జవాన్ టీజర్ లో షారుఖ్ ఖాన్ గాయపడి, కట్టుతో రగ్గడ్ బ్యాక్ డ్రాప్ లో కనిపించారు. ఈ ఫస్ట్ లుక్ జవాన్ లార్జర్ దెన్ లైఫ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా వుంటుందని చెప్పకనే చెప్పింది. జవాన్ హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషలలో 2023 జూన్ 2  ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

షారుఖ్ ఖాన్ మాట్లాడుతూ, జావన్ భాషలు, ప్రాంతాలకు అతీతంగా అందరూ ఆస్వాదించే యూనివర్సల్ కథ. ఈ విలక్షణమైన  చిత్రాన్ని రూపొందించిన క్రెడిట్ దర్శకుడు అట్లీకి దక్కుతుంది. నేను   యాక్షన్ చిత్రాలను ఇష్టపడుతున్నాను కాబట్టి జావన్  నాకు అద్భుతమైన అనుభూతిని ఇచ్చింది. టీజర్ రాబోయే అద్భుతానికి చిన్న గ్లిమ్ప్స్ లాంటింది మాత్రమే అన్నారు    

దర్శకుడు అట్లీ మాట్లాడుతూ.. జవాన్‌లో యాక్షన్‌, ఎమోషన్, డ్రామా ఇలానీ విజువల్ వండర్ గా వుంటాయి. ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని అందించాలనుకుంటున్నాను. ప్రేక్షకులంతా కలసి ఎంజాయ్ చేయగల గొప్ప చిత్రాన్ని షారూఖ్ ఖాన్ తప్పా మరెవరూ అందించగలరు. మునుపెన్నడూ లేని విధంగా ఈ చిత్రం ఉండబోతుంది అన్నారు.  

Pan India Film JAWAN First Look Unveiled:

Bollywood Baadshah Shah Rukh Khan, Atlee, Red Chillies Entertainment Pan India Film JAWAN First Look Unveiled

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ