Advertisementt

ఆయనతో నా కల సాకారమవుతుంది: మహేష్

Fri 03rd Jun 2022 02:23 PM
mahesh babu,mahesh comments on rajamouli movie,rajamouli,rajamouli-mahesh combo  ఆయనతో నా కల సాకారమవుతుంది: మహేష్
Mahesh interesting comments on Rajamouli Movie ఆయనతో నా కల సాకారమవుతుంది: మహేష్
Advertisement
Ads by CJ

ట్రిపుల్ ఆర్ తో వరల్డ్ వైడ్ గా దుమ్మురేపిన రాజమౌళి తన నెక్స్ట్ మూవీ మహేష్ తో అని ప్రకటించేసారు. అది ఎప్పుడు మొదలవుతుంది అంటే.. మధ్యలో మహేష్ బాబు త్రివిక్రమ్ మూవీ చెయ్యాల్సి ఉంది. ఆ సినిమా జూన్ లో మొదలై డిసెంబర్ కి ఎండ్ అవుతుంది. వచ్చే ఏడాది మొదట్లో రాజమౌళి - మహేష్ క్రేజీ పాన్ ఇండియా మూవీ మొదలవుతుంది అని రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ చెప్పారు. రాజమౌళి - మహేష్ కలయికలో రాబోయే మూవీ ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కబోతుంది.

అయితే రాజమౌళి తో సినిమా చేసేందుకు చాలా ఆసక్తిగా ఉన్నాను అంటూ మహేష్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పడం హైలెట్ అయ్యింది. రాజమౌళితో సినిమా విషయమై ఇప్పటికే కొన్ని ఆలోచనలపై చర్చించాం, ప్రస్తుతానికి దేనిపైనా స్పష్టత రాలేదు. ఇంతకుమించి రాజమౌళి సినిమాపై మట్లాడడం బాగోదు. కానీ రాజమౌళితో నా సినిమా కల సాకారమవుతుంది. ఆయనతో సినిమా చెయ్యాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్నా. అది ఇప్పటికి నెరవేరుతుంది. ఆయనతో సినిమా చేసేందుకు చాలా ఎగ్జైట్ అవుతున్నా అంటూ రాజమౌళి సినిమాపై మహేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు. నేను ఏ కథ ఓకె చేసినా, నేను నా గట్స్ ఫీలింగ్ తో ముందుకు వెళ్తా అదే నాకు ఇష్టం అంటూ మహేష్ చెప్పుకొచ్చారు. 

Mahesh interesting comments on Rajamouli Movie :

Mahesh Babu comments on Rajamouli Movie 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ