Advertisementt

ఆదిపురుష్ ఇంటర్నేషనల్ రిలీజ్

Fri 03rd Jun 2022 12:54 PM
adipurush,prabhas,bhushan kumar,t series,kriti sanon,om raut  ఆదిపురుష్ ఇంటర్నేషనల్ రిలీజ్
AdiPurush extravaganza Hollywood ఆదిపురుష్ ఇంటర్నేషనల్ రిలీజ్
Advertisement
Ads by CJ

ప్రభాస్ - ఓం రౌత్ కాంబోలో క్రేజీ చారిత్రాత్మక మూవీగా తెరకెక్కుతున్న ఆదిపురుష్ మూవీ అప్ డేట్ కోసం ప్రభాస్ ఫాన్స్ పడిగాపులు కాస్తున్నారు. ఎప్పుడో షూటింగ్ ఫినిష్ అయినా ఆదిపురుష్ నుండి కనీసం ప్రభాస్ రామ లుక్ అయినా ఇస్తే కాస్త కూల్ అయ్యేలా ఉన్నారు ఆయన ఫాన్స్. అలాగే పాన్ ఇండియన్ ఆడియన్స్ కూడా ఆదిపురుష్ ప్రభాస్ లుక్ కోసం వెయిటింగ్ లో ఉన్నారు. అయితే ఆదిపురుష్ అప్ డేట్స్ అక్టోబర్ లో ప్రభాస్ బర్త్ డే నుండి అయినా లేదంటే దసరా నుండి అయినా స్టార్ట్ చేసే ఉన్నట్లుగా ఆ సినిమా నిర్మాత భూషణ్ కుమార్ చెప్పడంతో ఆదిపురుష్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

అయితే ఇప్పుడు ఆదిపురుష్ హాలివుడ్ లో రిలీజ్ చేసే ప్రయత్నాల్లో మేకర్స్ ఉన్నారంటున్నారు. ఆ విషయంపై టి సిరీస్ అధినేత ఆదిపురుష్ నిర్మాత అయిన భూష‌ణ్ కుమార్ ఓ క్రేజీ అప్‌ డేట్ ఇచ్చారు. ఆది పురుష్ సినిమాను పాన్ ఇండియా సినిమాగా కాకుండా పాన్ వ‌ర‌ల్డ్ సినిమాగా విడుద‌ల చేయ‌డానికి హాలీవుడ్ నిర్మాణ సంస్థ‌ల‌తో చ‌ర్చ‌లు జరుపుతున్నట్టుగా చెప్పి ప్రభాస్ ఫాన్స్ కి కిక్ ఇచ్చారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఆదిపురుష్ నేషనల్ వైడ్ గా కాకుండా ఇంటర్నేషనల్ వైడ్ గా రిలీజ్ అవుతుంది అని, జనవరి 12 న వరల్డ్ వైడ్ గా ఆదిపురుష్ సంచలనాలను సృష్టించడం ఖాయమంటున్నారు. 

AdiPurush extravaganza Hollywood:

Crazy update on Adipurush 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ