Advertisement

జన గణ మన: దిశా కేసు గురించేనా?

Thu 02nd Jun 2022 07:43 PM
jana gana mana,prithviraj sukumaran,suraj venjaramoodu,sri divya  జన గణ మన: దిశా కేసు గురించేనా?
Jana Gana Mana: Did film reveal the truth of Telangana encounter case? జన గణ మన: దిశా కేసు గురించేనా?
Advertisement

మలయాళంలో పృథ్వీ రాజ్ - సూరజ్ వెంజరామూడు ప్రధాన పాత్రలలో తెరకెక్కిన జన గణ మన మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయ్యి సక్సెస్ అయ్యింది. ఈ రోజు నుండి తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో నెట్ ఫ్లిక్స్ ఓటిటి ద్వారా అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమాలో పృథ్వీ రాజ్ పోలీస్ ఆఫీసర్ గాను, లాయర్ గాను అద్భుతమైన పెరఫార్మెన్స్ తో ఆకట్టుకోగా.. సూరజ్ ACP సజ్జన్ గా నటించారు. అయితే మలయాళంలో తెరకెక్కిన జన గణ మన సినిమాకి మన తెలంగాణాలో జరిగిన దిశా ఎన్ కౌంటర్ కేసుకి లింక్ ఉంది. అంటే తెలంగాణాలో దిశా కేసు సృష్టించిన అలజడి అంతా ఇంతా కాదు. 

ఓ అమ్మాయిని నలుగురు యువకులు అత్యాచారం చేసి చంపెయ్యగా.. ఆ తర్వాత ఆ నలుగురిని పట్టుకున్న తెలంగాణ పోలీస్ లు సీపీ సజ్జనార్ నేతృత్వంలో ఎన్ కౌంటర్ చెయ్యడం అప్పట్లో కలకలం సృష్టించింది. స్టూడెంట్స్ నుండి, ప్రజలనుండి ఆ ఎన్ కౌంటర్ చెయ్యడం పట్ల హర్షించారు. కానీ సజ్జనార్ ఆ కేసులో హ్యూమన్ రైట్స్ ముందు హాజరవ్వాల్సి వచ్చింది. అప్పట్లో కేసీఆర్ సీపీ సజ్జనార్ కి ఎంకౌంటర్ బాధ్యతలు అప్పజెప్పడంతో ఆయన ఇలా చేసారని, అందుకే కేసీఆర్ ని హీరోగా పొగుడుతూ మీడియా హైలెట్ చేసింది.

అదే దిశా కేసు నేపథ్యంలోనే మలయాళ జన గణ మన ని తెరకెక్కించారు. ఓ కాలేజ్ లెక్చరర్ ని మరో లెక్చరర్ రోడ్ యాక్సిడెంట్ చేసి చంపెయ్యగా అది గవర్నెమెంట్ కి ఉపయోగపడేలా ఆ హత్యని చిత్రీకరించి ఓ నలుగురు అమాయకపు యువకులని హోమ్ మినిస్టర్ ఆధ్వర్యంలో ACP సజ్జన్ ఎంకౌంటర్ చెయ్యడం, దానికి స్టూడెంట్, మీడియా నుండి సపోర్ట్ రావడం వంటి విషయాలు, ఆ తర్వాత ఆ కేసు హ్యూమన్ రైట్స్ కి వెళ్లడం, సజ్జన్ కోర్టుకు హాజరవడం వరకు సేమ్ టు సేమ్ దిశా కేసుని పోలి ఉంది. ఇక ఆ కేసులో సినిమా వరకు ACP సజ్జన్ జైలు శిక్ష అనుభవిస్తున్నారు. గవర్నమెంట్ కి సపోర్ట్ చేసి ఆ ఎన్ కౌంటర్ చేసారు అంటూ పృథ్వీ రాజ్ వాదించడంతో ఆయన జైలుకి వెళ్లారు. మరి తెలంగాణ దిశా కేసు ని ఇన్స్పైరింగ్ గా తీసుకునే ఆ జన గణ మన ని తెరకెక్కించారు అని ఖచ్చితంగా అనిపిస్తుంది.  

Jana Gana Mana: Did film reveal the truth of Telangana encounter case?:

Jana Gana Mana mini review

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement