నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ అంటే సుందరానికీ. ఈ చిత్రం జూన్ 10 న రిలీజ్ కి రెడీ అవుతుంది. ప్రమోషన్స్ లో భాగంగా వైజాగ్ లో ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేసింది యూనిట్.
ట్రైలర్ లో సుందర్, లీలా థామస్ పాత్రలో నాని, నజ్రియాల ప్రేమకథ సరికొత్తగా, మ్యాజికల్ గా అనిపిస్తుంది. ట్రైలర్ లో కనిపించిన ప్రతి పాత్ర నవ్వులు పంచింది. అంటే సుందరానికీ కథ నేపధ్యం చాలా ఆసక్తికరంగా వుంది. సుందర్, లీలా వేరు వేరు ప్రపంచాలు. వారి కుటుంబాలు కూడా పూర్తిగా భిన్నం. సుందర్ కి ఒక పెద్ద కల వుంది. దాన్ని సాధించడానికి వాళ్ళే కుటుంబమే పెద్ద అడ్డంకి, ఇది చాలదన్నట్టు లీల, సుందర్ జీవితంలో వస్తుంది. తర్వాత కథ ఎలాంటి ఆసక్తికరమైన మలుపు తిరిగుందో తెలుసుకోవాలంటే అంటే సుందరానికీ చూడాల్సిందే.
ట్రైలర్ లో నాని మార్క్ నటన, టైమింగ్ ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. సాంప్రదాయ బ్రహ్మణ కుర్రాడిగా అద్భుతంగా కనిపించారు. సుందర్ పాత్రలో అమాయకత్వంతో పాటు చాలా వైవిధ్యం వుంది. లీలా పాత్రలో నజ్రియా స్క్రీన్ ప్రజన్స్ అందంగా వుంది. దర్శకుడు వివేక్ ఆత్రేయ మార్క్ ఫన్ అడుగడుగునా ఆకట్టుకుంది. రొమాంటిక్ ట్రాక్ కూడా చాలా కొత్తగా ఆకట్టుకుంది. ట్రైలర్ చివర్లో వచ్చిన టీవీ ఎపిసోడ్ కూడా హైలెట్ గా నిలిచింది.