మహేష్ బాబు - పరశురామ్ కలయికలో మే 12 న విడుదలైన సర్కారు వారి పాటకి బ్లాక్ బస్టర్ టాక్ అయితే ఆడియన్స్ నుండి, క్రిటిక్స్ నుండి రాలేదనే చెప్పాలి. సర్కారు వారి పాటకి జస్ట్ యావరేజ్ టాక్ మాత్రమే వచ్చింది. మహేష్ బాబు వన్ మ్యాన్ షో అంటూ అందరూ పొగడడమే, హీరోయిన్ కీర్తి సురేష్ ని, పరశురామ్ దర్శకత్వాన్ని మెచ్చుకున్న వారే లేరు. సర్కారు వారి పాట ఇప్పటికి మూడు వారాలు పూర్తి చేసుకుంది. ఆ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా10 నుండి 12 కోట్ల కలెక్షన్స్ రావాల్సి ఉంది. కానీ మేకర్స్ సినిమా సూపర్ హిట్ అంటూ కలెక్షన్స్ పోస్టర్స్ ని అఫీషియల్ గా ఎనౌన్స్ చేస్తూ వచ్చారు.
అదంతా ఓకె.. సర్కారు వారి పాట జూన్ 12 నుండి కానీ, జూన్ 24 నుండి కానీ ఓటిటిలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది అంటూ వార్తలొస్తున్నాయి. సర్కారు వారి పాట డిజిటల్ పార్ట్నర్ అమెజాన్ ప్రైమ్ వారు ఇప్పడు ఎర్లి ప్రీమియర్స్ అంటూ 199 పెట్టి సినిమాని కొనుక్కుని చూడమని చెబుతుంది. ఇంతకుముందు కెజిఎఫ్ చాప్టర్ 2 ని అలాగే ఎర్లి ప్రీమియర్స్ అంటూ పది రోజుల క్రితమే అమెజాన్ లో ఉంచారు. అదంటే పాన్ ఇండియా మూవీ సో వర్కౌట్ అయితే అవుతుంది. లేదంటే లేదు. కాని సర్కారు వారి పాట కేవలం తెలుగు సినిమా. దీనికి అంతంత మాత్రం టాక్ వచ్చింది. మళ్ళీ 199 పెట్టి ఎర్లి ప్రీమియర్స్ చూడాల్సిన ఆవరసం ఎవరికీ లేదు. మహేష్ ఫాన్స్ చూస్తారని నమ్మకం లేదు. మరి అమెజాన్ ప్రైమ్ ఎర్లి ప్రీమియర్స్ అనేది సర్కారు వారి పాటకి వర్కౌట్ అవ్వదనే అనిపిస్తుంది.