Advertisementt

F3 ఓటిటి ఆడియన్స్ కి బిగ్ షాక్

Thu 02nd Jun 2022 05:58 PM
f3,ott,anil ravipudi,venkatesh,varun tej  F3 ఓటిటి ఆడియన్స్ కి బిగ్ షాక్
Big shock to F3 OTT audience F3 ఓటిటి ఆడియన్స్ కి బిగ్ షాక్
Advertisement
Ads by CJ

గత శుక్రవారం థియేటర్స్ లో రిలీజ్ అయిన నవ్వుల ఫ్రాంచైజీ F3 మూవీ కి ఆడియన్స్ నుండి సూపర్ హిట్ టాక్ వచ్చేసింది. దర్శకుడు అనిల్ రావిపూడి వరస సక్సెస్ లని F3 తో మరోసారి కంటిన్యూ చేసారు. వెంకటేష్ రే చీకటి కామెడీ, వరుణ్ తేజ్ నత్తి కామెడీని ఆడియన్స్ థియేటర్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. క్రిటిక్స్ నుండి కూడా F3 కి మంచి రివ్యూస్ రావడంతో ఫస్ట్ వీకెండ్ లోనే కాదు, వీక్ డేస్ లో కూడా F3 కల్లెక్షన్స్ కళకళలాడుతున్నాయి. అయినప్పటికీ అనిల్ రావిపూడి, దిల్ రాజు, వెంకీ, వరుణ్ లు F3 ని ఇంకా ఇంకా ప్రమోట్ చేస్తూనే ఉన్నారు.

ఇక థియేటర్స్ లో చూడని వారు F3 ని ఓటిటిలో చూసేయ్యొచ్చు అని ఫ్యామిలీ ఆడియన్స్ ఆసక్తిగా ఆతృతగా ఎదురు చూస్తున్నారేమో.. అయితే F3 సినిమా అమెజాన్ ప్రైమ్ కాకుండా సోని లివ్ లో స్ట్రీమింగ్ కి రాబోతుంది. కానీ ఓ నెల తర్వాత F3 ఓటిటిలో స్ట్రీమింగ్ కి అవుతుంది అనుకుంటే.. పప్పులో కాలేసినట్లే అంటుంది F3 టీం. ఓ 8 వారాల వరకు F3 ఓటిటిలోకి వచ్చే ప్రసక్తే లేదు అంటున్నారు. అనిల్‌ రావిపూడి, హీరోలు వెంకటేశ్‌, వరుణ్‌ తేజ్‌లు ఓ వీడియో రిలీజ్‌ చేశారు. ఆ వీడియో లో F3 మూవీని ఇంత పెద్ద హిట్‌ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఈ మూవీని థియేటర్లో చూడని వారు ఓటీటీలో చూడొచ్చని అనుకుంటున్నారేమో.. కానీ మరో 8 వారాల వరకు ఎఫ్‌ 3 ఓటీటీకి వచ్చే ప్రసక్తే లేదు. కాబట్టి తప్పకుండా ఈ సినిమాను థియేటర్లో చూడాల్సిందే.. అంటూ చెప్పేసరికి ఫ్యామిలీ ఆడియన్స్ షాకవుతున్నారు.

Big shock to F3 OTT audience:

F3 Will Be Available On OTT Only After 8 Weeks Of Theatrical release

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ