టీడీపీలో గత కొన్నాళ్లుగా ఆక్టివ్ గా ఉంటున్న నటి దివ్యవాణి తనకి మహానాడులో జరిగిఆన్ అవమానానికి ప్రతీకగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం, తరవాత చంద్రబాబు బుజ్జగింపులతో మళ్ళీ రాజీనామాని వెనక్కి తీసుకున్నట్లుగా చెప్పడం, అంతలోనే టిడిపికి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించడం వంటి హై డ్రామా నిన్న మొత్తం నడిచింది. ఫైనల్లీ దివ్యవాణి టిడిపికి రాజీనామా చేసి మీడియా తో మట్లాడారు. ఈ మీడియా సమావేశంలో దివ్యవాణి తెలుగుదేశం పార్టీపై తీవ్ర వ్యాఖ‍్యలు చేశారు. తనకు జరిగిన అన్యాయంపై ఉద్వేగానికిలోనై ఆమె కన్నీరు పెట్టుకున్నారు.
టీడీపీలో గతేడాదిగా నాకు ప్రాధాన్యత ఇవ్వడంలేదు. టిడిపిలోనే కొందరు మహిళా నేతలు నాకు ఫోన్ చేసి తిట్టారు. కొందరు బుద్ధిలేని వారు బుద్ధిలేకుండా మాట్లాడుతున్నారు. ప్యాకేజీ అందింది అందుకే రాజీనామా చేయట్లేదని అంటున్నారు. నేను ఎవరికీ ఎప్పుడూ భజన చేయలేదు.. చేయను. పార్టీలో ఏం జరుగుతుందో ఉన్నది ఉన్నట్టు చెప్పాను.
అయితే తనపై జరుగుతున్న దుష్ప్రచారానికి చివరి నిమిషం వరకు క్లారిటీ తీసుకునేందుకే ఆగాను. ఇలాంటి రోజు వస్తుందని భావించలేదు. చంద్రబాబుకు మనస్సాక్షి ఉందా.. ఉంటే గుండెపై చేయి వేసుకుని చెప్పాలి. నేను మహానాడులో స్టేజ్ పై మట్లాడదామనుకున్న పాయింట్లు వేరే వాళ్లతో చెప్పించారు. మీటింగుల్లో ఎవరితో మాట్లాడించాలో ముందు అనుకుని మాట్లాడిస్తారు. టీడీ జనార్దన్ అనే వ్యక్తిని ప్రశ్నించినందుకు నరకం చూపిస్తారా.. అంటూ టిడిపిని ఆమె ప్రశ్నించారు.