విక్రమ్ ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ లో ఇదే హాట్ టాపిక్. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్, ఫాహద్ ఫాసిల్, విజయ్ సేతుపతి కలయికలో తెరకెక్కిన విక్రమ్ రేపు శుక్రవారం వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. తమిళంతోపాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీలో విడుదల కాబోతున్న విక్రమ్ పై అంచనాలు భారీగా వున్నాయి. ఈ సినిమాలో కమల్ లుక్, విజయ్ సేతుపతి లుక్, ఫాహద్ ఫాసిల్ లుక్స్ అన్ని కొత్తగా డిజైన్ చేసాడు దర్శకుడు. అయితే ఈ సినిమాలో నటించిన వీరి పారితోషకాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హైలెట్ అవుతున్నాయి.
విక్రమ్ మూవీ కోసం కమల్ హాసన్ 50 కోట్ల పారితోషకం అందుకున్నారని అంటున్నారు. తర్వాత విజయ్ సేతుపతి 10 కోట్లు, దర్శకుడు లోకేష్ కానగరాజ్ 8 కోట్లు, మలయాళ హీరో ఫాహద్ ఫాసిల్ 4 కోట్లు ముట్టజెప్పినట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవి చంద్రన్ కి కూడా దాదాపు 4 కోట్లు ఇచ్చారట మేకర్స్. మరి విక్రమ్ బడ్జెట్ 120 కోట్లు పెట్టినట్లుగా తెలుస్తుంది. అటు నాన్ థియేట్రికల్ రైట్స్, థియేట్రికల్ రైట్స్ కలిపి నిర్మాతలకు భారీగా వచ్చింది అని, విక్రమ్ కి ఉన్న క్రేజ్ ప్రకారం మేకర్స్ కి భారీగా లాభాలు రావడం ఖాయమంటున్నారు.