పవన్ కళ్యాణ్ తో సినిమా చెయ్యడానికి ఏ హీరోయిన్ అయినా ఎగిరి గంతేస్తుంది. కానీ ఓ హీరోయిన్ మాత్రం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం డేట్స్ ఖాళీ ఉండొద్దా అంటుందట. ఆమె ఎవరో కాదు ప్రస్తుతం వరసగా మూడు ప్లాప్స్ లో ఉన్న పూజ హెగ్డే. హరీష్ శంకర్ - పవన్ కళ్యాణ్ కలయికలో మొదలు కావల్సిన భవదీయుడు భగత్ సింగ్ సినిమాలో హీరోయిన్ గా ఆల్మోస్ట్ పూజ హెగ్డే ఫిక్స్ అనే టాక్ నడిచింది. హరీష్ శంకర్ కూడా పూజ హెగ్డే కి ఫిక్స్ అయ్యి ఆమెని సంప్రదించగా.. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా చెప్పారు.
కానీ ఇప్పుడు పూజ హెగ్డే మాత్రం పవన్ కళ్యాణ్ సినిమా నో చెప్పింది అనే టాక్ వినిపిస్తుంది. పూజా హెగ్డే భవదీయుడు భగత్ సింగ్ సినిమాలో నటించడానికి సిద్ధంగా లేదు అని ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లుగా కథనాలు వెలువడుతున్నాయి. అయితే పూజ పవన్ మూవీని వదులుకోవడానికి కారణం ఆమెకి బాలీవుడ్ మూవీస్ తో డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడమేనట. మరోపక్క పవన్ మూవీ ఎప్పుడు మొదలు పెడతారో క్లారిటీ రావడం లేదు. ఎందుకంటే ఆయన రాజకీయాలు, హరి హర వీరమల్లు, సముద్రఖని మూవీస్ తో బిజీ అవుతున్నారు. సో భవదీయుడు భగత్ సింగ్ ఎప్పుడు మొదలవుతుందో తెలియక పూజ సతమతమవుతోంది అంటున్నారు.