కమల్ హాసన్ - విజయ్ సేతుపతి - ఫహద్ ఫాసిల్ కలయికలో సినిమా అంటే ఆ సినిమాపై ఎన్ని అంచనాలుండాలి, ట్రేడ్ లో ఎంత హైప్ ఉండాలి. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన విక్రమ్ పాన్ ఇండియా స్టయిల్లో పలు భాషల్లో విడుదలకాబోతుంది. 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా కథ అన్నదమ్ములైన ఓ గ్యాంగ్‌స్టర్, ఓ పొలిటిషియన్ జీవితాల నేపథ్యంగా, వారి మధ్య చోటుచేసుకొన్న విభేదాల నేపథ్యంలో రా ఏజెంట్ కమల్ ఏం చేసాడు అనేది నేపథ్యం. విక్రమ్ పై క్రేజీ అంచనాలతో వివిధ భాషల్లో విక్రమ్ కి థియేట్రికల్ రైట్స్ మంచి రేటు పలికాయి. విక్రమ్ థియేట్రికల్ బిజినెస్ ఏరియాల వారీగా మీ కోసం
ఏరియా ప్రీ రిలీజ్ బిజినెస్ (కోట్లలో)
తమిళనాడు 35.00 కోట్లు
తెలుగు 06.00 కోట్లు
కర్ణాటక 5.50 కోట్లు
మలయాళం 4.25 కోట్లు
హిందీ 35.00 కోట్లు
ఓవర్సీస్ 16.00 కోట్లు
వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ 95.75 కోట్లు
ఇంకా శాటిలైట్, డిజిటల్, ఆడియో రైట్స్ క్రేజీ డీల్స్ తో అమ్ముడు పోవడంతో.. మొత్తంగా విక్రమ్ కి థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ కలిపి 198.75 కోట్లుగా నమోదైంది.