ప్రభాస్ ప్రస్తుతం ప్రాజెక్ట్ కే అలాగే సలార్ షూటింగ్స్ అంటూ చాలా బిజీగా వున్నారు. ప్రాజెక్ట్ కె షెడ్యూల్ పూర్తవ్వగానే.. ప్రశాంత్ నీల్ తో సలార్ కొత్త షెడ్యూల్ మొదలు పెట్టేసారు. తర్వాత సందీప్ వంగా స్పిరిట్, అలాగే మారుతి తో మరో సినిమాలు లైన్ లో ఉన్నాయి. ఈ లోపు తమిళ స్టార్ డైరెక్టర్ ఒకరు ప్రభాస్ ని కలిసి కథ చెప్పి ఒప్పించే ప్రయత్నాల్లో ఉన్నారంటూ ఓ న్యూస్ టాలీవుడ్, కోలీవుడ్ మీడియా సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. అది కమల్ హాసన్ తో విక్రమ్ పాన్ ఇండియా మూవీ చేసిన లోకేష్ కనకరాజ్.. ప్రభాస్ ని కలిశారట.
రీసెంట్ గా విక్రమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హైదరాబాద్ వచ్చిన లోకేష్ కనకరాజ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ తో కలిసి ప్రభాస్ ని మీటయ్యి కథ చెప్పగా.. ప్రభాస్ లోకేష్ కనకరాజ్ కి నో చెప్పారనే మేటర్ సోషల్ మీడియాలో హైలెట్ అయ్యింది. లోకేష్ కనకరాజ్ చెప్పిన కథ నచ్చలేదా? లేక డేట్స్ అడ్జస్ట్ చేయలేక ప్రభాస్, లోకేష్ ని తిరస్కరించాడా? అన్నది మాత్రం తెలియాల్సి ఉంది. లోకేష్ కనకరాజ్ కూడా సాదా సీదా డైరెక్టర్ కాదు. ఖైదీ, మాస్టర్ లాంటి సినిమాలతో పాపులర్ స్టార్ డైరెక్టర్ అయ్యాడు ఆయన. మరి ప్రభాస్ నిజంగానే ఆయన్ని రిజెక్ట్ చేశాడా? లేదంటే ఇది జస్ట్ రూమరా? అనేది కూడా తెలియాల్సి ఉంది.