Advertisementt

నిఖిల్ కార్తికేయ 2 ఫస్ట్ లుక్ అండ్ రిలీజ్ డేట్

Wed 01st Jun 2022 11:58 AM
karthikeya 2,karthikeya 2 first look,nikhil,nikhil birthday,anupama parameswaran  నిఖిల్ కార్తికేయ 2 ఫస్ట్ లుక్ అండ్ రిలీజ్ డేట్
Karthikeya 2 first look and motion poster goes viral నిఖిల్ కార్తికేయ 2 ఫస్ట్ లుక్ అండ్ రిలీజ్ డేట్
Advertisement
Ads by CJ

ఎన‌ర్జిటిక్ యంగ్ హీరో నిఖిల్.. చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో కార్తికేయకి సీక్వెల్ గా వస్తున్న కార్తికేయ‌ 2 మోషన్ పోస్టర్ ని నిఖిల్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసారు మేకర్స్. సముద్రం దాచుకున్న అతిపెద్ద రహస్యం.. ఈ ద్వారకా నగరం అంటూ హీరో నిఖిల్ వాయిస్ తో వచ్చిన ఈ మోషన్ పోస్టర్ ఆసక్తి రేపుతోంది.  కార్తికేయ‌ 2 షూటింగ్ మొద‌ల‌య్యిన ద‌గ్గ‌ర‌ నుంచి సామాన్య ప్రేక్ష‌కుల్లో, సినిమా ప్ర‌ముఖుల్లో ఆసక్తి నెల‌కొంది. ఈ చిత్రంలో ముగ్ధ పాత్రలో అనుపమ పరమేశ్వరన్.. నిఖిల్ కి జంట‌గా న‌టిస్తుంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. 

తాజాగా విడుదలైన మోషన్ పోస్ట‌ర్ లో ఆసక్తికరమైన విషయం డాక్ట‌ర్ కార్తికేయ ప్ర‌యాణం.  శ్రీకృష్ణుడు చ‌రిత్ర‌లోకి ఎంట‌ర‌వుతూ క‌నిపిస్తున్నారు ఈయన. ఈ చిత్రంలోని భావాన్ని మోషన్ పోస్ట‌ర్ రూపంలో ద‌ర్శ‌కుడు చందు మొండేటి ప్రేక్ష‌కుల క‌ళ్ళ‌కు క‌ట్టిన‌ట్టు చూపించారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని జులై 22న ప్ర‌పంచ‌ వ్యాప్తంగా తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రానుంది కార్తికేయ 2. 

Karthikeya 2 first look and motion poster goes viral:

Karthikeya 2 first look increases the thrill factor

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ