కరోనా పాండమిక్ సిట్యువేషన్ ముగిసాక.. ప్రతి శుక్రవారం ఏదో ఒక సినిమా కాదు, వారానికి నాలుగైదు సినిమాలు చొప్పున అన్ని భాషల నుండి ఆడియన్స్ ని అలరించడానికి బాక్సాఫీసుకి క్యూ కడుతున్నాయి. అందులో ఒకటో రెండో ఇంట్రస్టింగ్, క్రేజీ మూవీస్ ఉంటే.. మిగతావి వస్తుకా నామ్ అన్నట్టుగా ఉంటున్నాయి. అయితే ప్రతి వారం ఒక ఎత్తు ఈ శుక్రవారం ఒక ఎత్తు అన్నట్టుగా రెండు పాన్ ఇండియా మూవీస్ తో పాటుగా బాలీవుడ్ పృథ్వీరాజ్ మూవీ బాక్సాఫీస్ ఫైట్ కి రెడీ అయ్యాయి. అందులో టాలీవుడ్ నుండి మేజర్ మూవీ పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ అవుతుంది.
ఆ మూవీపై యూత్ లో మంచి ఇంట్రెస్ట్ ఉంది. మేజర్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈమూవీలో అడివి శేష్ హీరోగా నటించడం, ఆ సినిమా ట్రైలర్, ప్రమోషన్స్ అన్ని సినిమాపై ఆసక్తిని కలిగించాయి. తమిళం నుండి లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ నటిస్తున్న విక్రమ్ కూడా పాన్ ఇండియా మూవీగా రేపు శుక్రవారమే రాబోతుంది. ఆ సినిమాపై అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. మేజర్, విక్రమ్ ఈ రెండు సినిమాల్లో ముందు ఏ సినిమా చూడాలనే కన్ఫ్యూజన్ ని ఆ రెండు సినిమాలు క్రియేట్ చేసాయి. అంత ఆసక్తితో ఆ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.
ఇక బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ నటించిన పృథ్వీరాజ్ భారీ అంచనాల నడుమ రేపే రిలీజ్ అవ్వబోతుంది. సో ఈ వారం ఆడియన్స్ ముందుగా ఏ సినిమా చూడాలా అనే కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేసింది.
-పర్వతనేని రాంబాబు.