Advertisementt

జన గణ మన కోసం పూజ హెగ్డే యాక్షన్

Wed 01st Jun 2022 10:34 AM
jana gana mana,pooja hegde,martial arts,vijay devarakonda,puri jagannath  జన గణ మన కోసం పూజ హెగ్డే యాక్షన్
Pooja Hegde to perform stunts in Jana Gana Mana జన గణ మన కోసం పూజ హెగ్డే యాక్షన్
Advertisement
Ads by CJ

ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ కోసం సమంత కొన్ని యుద్ధ విన్యాసాలు నేర్చుకుని మరీ నటించింది. ఆ సీరీస్ సమంత ని పాన్ ఇండియా స్టార్ ని చేసింది. ఇక శృతి హాసన్ క్రాక్ సినిమాలో చేసిన ఫైట్ కి సలార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఫిదా.. అందుకే ప్రభాస్ కి జోడిగా ఛాన్స్ ఇచ్చారు ఆయన. ఇక మలయాళం, తెలుగు, తమిళ్ లో తెరకెక్కుతున్న సీత రామం కోసం రష్మిక కాశ్మీరీ గర్ల్ లా తుపాకీ పట్టింది. ఆ లిస్ట్ లోకి ఇప్పుడు పూజ హెగ్డే కూడా చేరబోతున్నట్టుగా తెలుస్తుంది.

అంటే విజయ్ దేవరకొండ తో పూరి జగన్నాధ్ తెరకెక్కిస్తున్న జన గణ మన మూవీ లో పూజ హెగ్డే ని హీరోయిన్ గా ఫైనల్ చేసారని అంటున్నారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సోల్జర్ లా కనిపించబోతున్నాడు. ఇప్పుడు పూజ హెగ్డే కూడా జన గణ మన పోరాట ఘట్టాల్లో నటించేందుకు థాయ్ బృందం తో యుద్ధ కళల్లో శిక్షణ తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. జన గణ మన లో పూజ పాత్ర యాక్షన్ ఆధారంగా డిజైన్ చెయ్యబడింది అని, అందుకే పూజ హెగ్డే మార్షల్ ఆర్ట్స్ లో నైపుణ్యం పొందేందుకు శిక్షణ తీసుకుంటుంది. అది పూర్తవ్వగానే జన గణ మన రెగ్యులర్ షూట్ ని పూరి ముంబై లో మొదలు పెట్టనున్నట్లుగా సమాచారం.

Pooja Hegde to perform stunts in Jana Gana Mana:

Jana Gana Mana: Pooja Hegde to train in martial arts

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ