Advertisementt

కెజిఎఫ్ ఫాన్స్ కి గుడ్ న్యూస్

Tue 31st May 2022 07:48 PM
kgf 2,kgf 2 ott release,amazon prime video  కెజిఎఫ్ ఫాన్స్ కి గుడ్ న్యూస్
KGF 2 OTT Release Date And Time fix కెజిఎఫ్ ఫాన్స్ కి గుడ్ న్యూస్
Advertisement
Ads by CJ

కెజిఎఫ్ చాప్టర్ 2 థియేటర్స్ దుమ్ము దులిపి మాస్ ఆడియన్స్ కి కిక్ ఇచ్చిన కన్నడ సినిమా సినిమా. పాన్ ఇండియా మూవీ గా విడుదలైన ప్రతి భాషలోనూ అదిరిపోయే కలెక్షన్స్ తో రికార్డులని సెట్ చేసి బాలీవుడ్ ని షేక్ చేసింది. కెజిఎఫ్ చాప్టర్ 2 కి బాలీవుడ్ బాక్సాఫీసు వణికిపోయింది. కెజిఎఫ్ తో దుమ్ములేపిన యశ్ - ప్రశాంత్ నీల్ లలో ప్రశాంత్ నీల్ సలార్ తో బిజీ అయ్యారు. యశ్ ఇంకా కొత్త మూవీని ప్రకటించలేదు. కెజిఎఫ్ థియేట్రికల్ రన్ ముగిసింది, అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. కానీ అమెజాన్ లో ఎర్లీ ప్రీమియర్స్ చూడాలంటే 199 కట్టాలి. ఇది కెజిఎఫ్ ఫాన్స్ కి అమెజాన్ ప్రైమ్ ఇచ్చిన షాక్. అంటే ఒరిజినల్ అమెజాన్ ప్రైమ్ జూన్ లో స్ట్రీమింగ్ కి రావాలి. కానీ మే లోనే అమెజాన్ ప్రైమ్ లో పెట్టేసి ఎర్లీ ప్రీమియర్స్ 199 కట్టమనగానే అందరూ ఉసూరుమన్నారు.

అబ్బా 199 కట్టి ఎర్లీ ప్రీమియర్స్ చూసేందుకు కెజిఎఫ్ ఫాన్స్, మాస్ ఆడియన్స్ సిద్దమయినా ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం కాస్త చిరాకు పడ్డారు. అమెజాన్ ప్రైమ్ కొనుక్కుని మళ్ళీ ఎర్లీ ప్రీమియర్స్ కోసం కట్టుడేమిటి అంటూ అమెజాన్ పై ఆగ్రహం వ్యక్తం చేసారు. అయితే ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో ఫ్రీ గా చూసేందుకు కెజిఎఫ్ చాప్టర్ 2 కి డేట్ ఫిక్స్ అయ్యింది. అమెజాన్ ప్రైమ్ లో ఫ్రీగా కెజిఎఫ్ ని చూసేందుకు జూన్ 3 న రెడీ అవ్వండి అంటూ ప్రకటించింది అమెజాన్ సంస్థ. సో మాస్ ఆడియన్స్, కెజిఎఫ్ ఫాన్స్ మరోసారి కెజిఎఫ్ చూసేందుకు రెడీ అయ్యిపోండి. 

KGF 2 OTT Release Date And Time fix:

KGF 2 OTT Release Date And Time On Amazon Prime Video

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ