మహేష్ బాబు - త్రివిక్రమ్ కలయికలో మొదలు కాబోతున్న SSMB28 మూవీ అప్ డేట్ ఈరోజు ఏదైనా ఉంటుంది అని మహేష్ ఫాన్స్ ఆశగా ఎదురు చూసారు. కానీ కృష్ణ గారి పుట్టిన రోజునాడు SSMB28 నుండి ఎలాంటి ట్రీట్ ఫాన్స్ కి ఇవ్వలేదు. అయితే మహేష్ తో త్రివిక్రమ్ చెయ్యబోయే సినిమా బడ్జెట్ పై ఓ న్యూస్ సోషల్ మీడియాలో క్రేజీగా చక్కర్లు కొడుతోంది. అది SSMB28 కి మేకింగ్ బడ్జెట్ గా 90 కోట్లు కేటాయించబోతున్నారట హారిక హాసిని మేకర్స్. అంటే హీరో-దర్శకుల పారితోషకాలు కాకుండా జస్ట్ సినిమాకి పెట్టె పెట్టుబడి మాత్రమే 90 కోట్లు అంటున్నారు.
ఇక హీరో మహేష్ రెమ్యునరేషన్ గా 60 కోట్లు, అలా వైకుంఠపురములో బ్లాక్ బస్టర్ తర్వాత త్రివిక్రమ్ రేంజ్ ఒక్కసారిగా పెరగడంతో ఆయనకి లాభాల్లో వాటా లేకుండానే.. పారితోషకం కింద 50 కోట్లు ఇవ్వబోతున్నారనే టాక్ సోషల్ మీడియాని ఊపేస్తోంది. మిగతా నటీనటులు టెక్నీషియన్ల మొత్తం పారితోషకాలు మేకింగ్ బడ్జెట్ తో కలిపితే మొత్తంగా 200 కోట్ల వరకు ఖర్చయ్యే అవకాశం ఉన్నట్లుగా, అలాగే త్రివిక్రమ్ అంతకు మించి ఒక్క రూపాయి ఎక్కువ ఖర్చు కాకుండా పక్కాగా స్క్రిప్ట్ ని రెడీ చేశారట. ఇక సినిమాకి రెండు వందల కోట్లు పెడుతుంటే ఎలా లేదన్న మూడు వందల కోట్ల బిజినెస్ జరగడం ఖాయమని మేకర్స్ లెక్కలు వేసుకుంటున్నారని తెలుస్తుంది. మరి ఈ న్యూస్ చూసిన మహేష్ ఫాన్స్ క్రేజీగా రియాక్ట్ అవుతున్నారు.