F2 తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి దానికి సీక్వెల్ గా F3 చేసి మళ్లీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టెయ్యడమే కాదు.. బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ కొల్లగొడుతున్న దిల్ రాజు ఇప్పుడు పాన్ ఇండియా మూవీస్ తో బాగా బిజీగా మారిపోయారు. F3 ప్రమోషన్స్, అలాగే సక్సెస్ సెలెబ్రేషన్స్ అంటూ దిల్ రాజు హీరోలు వెంకీ - వరుణ్ దర్శకుడు అనిల్ రావిపూడి తో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక రామ్ చరణ్ తో పాన్ ఇండియా మూవీ చేస్తున్న దిల్ రాజు తమిళ విజయ్ తో మరో మూవీ చేస్తున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో దిల్ రాజు తన మనుసులో ఉన్న హీరోలు ఎవరో బయట పెట్టారు.
అంటే ఆ హీరోలతో ఆయన సినిమాలు చెయ్యాలనుకుంటున్నారట. ఇప్పటికే తనకి ఇష్టమైన పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టిన దిల్ రాజుకి యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చెయ్యాలని ఉందట. ఎన్టీఆర్ తో సినిమా చెయ్యాలని కొంతకాలంగా అనుకుంటున్నా కుదరడం లేదు అని, ఎవరి సినిమాల్లో వాళ్ళం బిజీగా ఉన్నామని, ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల, ప్రశాంత్ నీల్ తో మూవీస్ ఉన్నాయి కాబట్టి తదుపరి ఆయనతో తానూ సినిమా చేస్తాను అని, ఎన్టీఆర్ ని ఒక్కసారి మీట్ అయితే సినిమా ఓకె అవుతుంది అని చెబుతున్నారు. ఎందుకంటే ఎన్టీఆర్ తో తనకంత అనుబంధం ఉంది అంట. ఎన్టీఆర్ తర్వాత ప్రభాస్, మహేష్, అల్లు అర్జున్ లతో కూడా సినిమాలు చేయనున్నాను అని, ఒక సినిమా తర్వాత మరొకటి వరసగా సెట్స్ మీదకెళతాయని, ఏ హీరో క్రేజ్ కి తగ్గట్టుగా ఆ సినిమా ఉంటుంది అంటూ దిల్ రాజు ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపెట్టారు.