బిగ్ బాస్ అనేది ఇకపై ఏడాదికి రెండుసార్లు ఆడియన్స్ ని అలరించడానికి సిద్ధమైపోయింది. ఈ ఏడాది ఇప్పటికే బిగ్ బాస్ నాన్ స్టాప్ అంటూ ఓటిటి బిగ్ బాస్ పూర్తయ్యింది. ఇకపై స్టార్ మా లో ప్రసారం కాబోయే బిగ్ బాస్ సీజన్ 6 న్యూస్ లు మొదలైపోయాయి. బిగ్ బాస్ సీజన్ 6 లో ఈసారి సామాన్యులకి ఎంట్రీ అంటూ నాగార్జున ఎప్పుడో వీడియో ప్రోమోతో దిగిపోయారు. సామాన్యులు బిగ్ బాస్ కి ఎలా ఎంటర్ అవ్వాలో ఆ ప్రోమోలో వివరాలు ఇచ్చారు. మరోపక్క సీజన్ 6 కి వెళ్లబోయే కంటెస్టెంస్ట్ పై రోజుకో న్యూస్ వినిపిస్తుంది.
అయితే ఈసారి బిగ్ బాస్ సీజన్ 6 జూన్, జులై అన్నప్పటికీ.. ఫైనల్ గా జూన్ నుండి స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అంటున్నారు. గతంలోలా సెప్టెంబర్ నుండి కాకుండా ఈసారి జూన్ లోనే సీజన్ 6 ని మొదలు పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ప్రెజెంట్ అన్నపూర్ణ స్టూడియోస్ లో ఉన్న బిగ్ బాస్ సెట్ ని అటు ఇటుగా కాస్త మార్పులు చేసి హౌస్ ని సీజన్ 6 కోసం సిద్ధం చేస్తున్నారట. మరోపక్క బిగ్ బాస్ యాజమాన్యం కంటెస్టెంట్స్ ని ఫైనల్ చేసే పనిలో ఉన్నట్లుగా తెలుస్తుంది. తాజాగా బిగ్ బాస్ సీజన్ 6 గ్రాండ్ లాంచ్ ప్రోమో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.