విజయ్ దేవరకొండ పూరి జగన్నాధ్ తో లైగర్ మూవీ షూటింగ్ ముగించేసి కూల్ గా కాశ్మీర్ లో శివ నిర్వాణ ఖుషి మూవీ సెట్స్ లోకి అడుగుపెట్టడం, అక్కడ ఓ నెలరోజులపాటు లాంగ్ షెడ్యూల్ ని పూర్తి చేసేసుకోవడం జరిగిపోయాయి. ఇక రెండో షెడ్యూల్ కి గ్యాప్ రావడంతో ఈలోపు విజయ్ దేవరకొండ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో మరో మూవీ జన గణ మన కి ప్రిపేర్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. విజయ్ దేవరకొండ - పూరి జగన్నాధ్ కాంబోలో ఏప్రిల్ లో మొదలైన జన గణ మన రెగ్యులర్ షూట్ జూన్ మొదటి వారంలో ముంబై లో మొదలు కాబోతున్నట్టుగా తెలుస్తుంది.
అయితే ఈ సినిమాలో ముందు జాన్వీ కపూర్ హీరోయిన్ అన్నప్పటికీ.. ఈమధ్యన పూజ హెగ్డే విజయ్ దేవరకొండ సరసన నటించే ఛాన్స్ ఉంది అన్నారు. ఇప్పుడు పూజ హెగ్డే నే విజయ్ సరసన జన గణ మన మూవీలో ఫిక్స్ అయ్యింది అని.. జన గణ మన ఫస్ట్ షెడ్యూల్ లోనే పూజ కూడా సెట్స్ లోకి రాబోతుంది అంటున్నారు. ఇక ఖుషి - జన గణ మన మూవీస్ లో విజయ్ దేవరకొండ లుక్ పారలాల్ గా ఉంటుంది కాబట్టి రెండు సినిమాల్లో విజయ్ ఒకేసారి పాల్గొంటారట. ఇక విజయ్ దేవరకొండ జన గణ మన లో సోల్జర్ గా నటించబోతున్నారు.