Loading...
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Srinidhi Shetty demands huge remuneration

కేజిఎఫ్ హీరోయిన్ కాస్ట్లీ కోరికలు

Srinidhi Shetty demands huge remuneration

కేజిఫ్ చాప్టర్ 1, కేజిఎఫ్ చాప్టర్ 2 లో హీరో యశ్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కి వచ్చినంత క్రేజీ పేరు రాకపోయినా.. పాన్ ఇండియా మూవీస్ లో నటించిన హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి కి మంచి పేరే వచ్చింది. మోడల్ గా చేస్తున్న టైం లోనే ఆమెకి కేజిఎఫ్ ఆఫర్ రావడంతో ఒక్కసారిగా ఈ కన్నడ బ్యూటీ గురించి ప్రపంచానికి తెలిసింది. ఆ సినిమా పాన్ ఇండియా మెర్కెట్ లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో శ్రీని శెట్టి కూడా ఒక్కసారిగా ఫెమస్ అయ్యింది. అందుకే పాప చాలా త్వరగా వచ్చిన ఫేమ్ ని పర్ఫెక్ట్ గా యూస్ చేసుకోవాలని చూస్తుంది.

కేజిఎఫ్ హిట్ తో శ్రీనిధి కి ఆఫర్స్ కూడా తలుపు తడుతున్నాయి. అయితే ఇంతవరకు శ్రీనిధి శెట్టి ఏ సినిమాని ఓకె చేసిన దాఖలాలు లేవు కానీ, ఆమె మాత్రం కేజిఎఫ్ క్రేజ్ ని వాడేసి.. పారితోషకం విషయంలో చెట్టెక్కేసింది అనే టాక్ వినిపిస్తుంది. ఈమధ్యన ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకి ఫేమ్ కన్నా డబ్బే ముఖ్యమని చెప్పినట్లుగా తెలుస్తుంది. సో శ్రీనిధి శెట్టిని తమ సినిమాల్లోకి తెచ్చుకోవాలంటే ఆమె కాస్ట్లీ కోరికని తీర్చాల్సిందే అన్నమాట. 

KGF actress Srinidhi Shetty demands huge remuneration for her next Movie

kgf
actress srinidhi shetty
srinidhi shetty
kannada beauty