నిన్నమొన్నటివరకు రష్మిక vs పూజ హెగ్డే అనేట్టుగా ఉండేది సీన్. ఎందుకంటే ఇద్దరూ సౌత్ లో టాప్ హీరోయిన్స్ గా స్టార్స్ హీరోల ఛాన్స్ లతో వేరే హీరోయిన్స్ ని అడుగుపెట్టనియ్యలేదు. ఒకేసారి పాన్ ఇండియా మూవీస్ చేసినా వీరిలో రష్మిక పాన్ ఇండియా మూవీ పుష్ప తో హిట్ కొట్టగా.. పూజ హెగ్డే రాధే శ్యామ్ పాన్ ఇండియా ఫిలిం తో ప్లాప్ అందుకుంది. అంతేకాదు.. పూజ హేగ్డ్ కి వరసగా ఆచార్య, బీస్ట్ ప్లాప్ లు పడిపోయాయి. కానీ రష్మిక హ్యాండ్ రేజింగ్ లో ఉంది. అటు బాలీవుడ్ స్టార్ హీరోల ప్రాజెక్ట్స్ తో బిజీగా మారిన రశ్మికకి తమిళ విజయ్ సినిమాలో ఛాన్స్ పట్టేసింది. అయితే పూజ హెగ్డే మాత్రం F3 తో స్పెషల్ హిట్ కొట్టింది. అంటే స్పెషల్ సాంగ్ తో రెచ్చిపోయింది.
అంతలా ఇద్దరిలో పోటీ నడుస్తుండగా.. ఇప్పుడు రష్మిక సినిమాలో పూజ హెగ్డే స్పెషల్ సాంగ్ చెయ్యబోతుంది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది. అంటే రష్మిక బాలీవుడ్ లో చేస్తున్న రణబీర్ కపూర్ - సందీప్ వంగా ల యానిమల్ మూవీలో పూజ హేగ్డ్ ని స్పెషల్ సాంగ్ కోసం సంప్రదిస్తున్నారంటూ ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఇక పూజ హెగ్డే బాలీవుడ్ లోను సల్మాన్ ఖాన్, రణ్వీర్ సింగ్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తుంది. నిజంగా సౌత్, నార్త్ సినిమాలతో పోటీ పడుతున్న ఈ ఇద్దరు హీరోయిన్స్ ఒకే సినిమాలో అంటే ఆడియన్స్ బాగా ఎగ్జైట్ అయ్యే అవకాశం లేకపోలేదు.