ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లో జెండా పాతేసి యంగ్ హీరోలందరితో సినిమాలు చేసేస్తున్న కృతి శెట్టి వరస హిట్స్ తో లక్కీ హీరోయిన్ గా మారిపోయింది. గత ఏడాది శ్యామ్ సింగ రాయ్, ఈ ఏడాది బంగార్రాజు తో హిట్స్ అందుకున్న కృతి శెట్టి ఇప్పుడు రామ్ తో ద వారియర్ లో విజిల్ మహాలక్ష్మిలా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. అలాగే సుధీర్ బాబు మూవీ, మరోపక్క నితిన్ మాచర్ల నియోజక వర్గంలో నటిస్తున్న కృతి శెట్టి ఓ ఇంటర్వ్యూలో కన్నీళ్లు పెట్టుకోవడం హాట్ టాపిక్ గా మారింది. కృతి శెట్టి తాజాగా ఓ అవార్ఫ్ ఫంక్షన్ లో పాల్గొంది. ఆ అవార్డ్స్ వేడుకలో ఆమెకి ఉత్తమ నటి అవార్డు రావడంతో ఆమెని ఇంటర్వ్యూ చేసేందుకు ఓ ఛానల్ యాంకర్స్ ఇద్దరు పోటీ పడ్డారు. ఇద్దరూ కృతి శెట్టి ని ఇంటర్వ్యూ చేస్తున్న టైం లో ఓ యాంకర్ వరసగా కృతి శెట్టిని ప్రశ్నలు అడుగుతున్నారు.
ఆ యాంకర్ అడిగిన ప్రశ్నలకు కృతి శెట్టి నవ్వుతూ సమాధానాలు చెబుతుంది. ఇంతలో మరో యాంకర్ లేచి.. అన్ని ప్రశ్నలు నువ్వే అడిగేస్తే నేనేం చెయ్యాలి, నన్నెందుకు ఈ ఇంటర్వ్యూలో కూర్చోబెట్టారు. ఈ మాత్రం దానికి ఇంత కాస్ట్లీ బట్టలు ఎందుకు, లైవ్ ఆపండి, కెమెరా ఆపండి అంటూ ఇద్దరూ గొడవ పడడంతో కృతి శెట్టి షాకైపోయింది. అంతలో ఆ యాంకర్స్ ఇదంతా ప్రాంక్ వీడియో మీరేం కంగారు పడకండి.. అనగానే కృతి శెట్టి కన్నీళ్లు పెట్టేసుకుంది. తన ముందు ఎవరైనా గట్టిగా గొడవపడినా గట్టిగా మాట్లాడినా తనకి భయమని చెప్పడంతో మిగతా టీం వచ్చి కృతి శెట్టిని ఓదార్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.