Advertisementt

సలార్ లో సముద్రం ఫైట్

Mon 30th May 2022 12:01 PM
salaar,prabhas,prashanth neel,kgf 2,kannada villains,prudhwiraj sukumanaran,jagapathi babu,sruthi haasan  సలార్ లో సముద్రం ఫైట్
Salaar: Prabhas sensation in the ocean సలార్ లో సముద్రం ఫైట్
Advertisement
Ads by CJ

ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న సలార్ మూవీ పై పాన్ ఇండియా లెవల్లో భారీ అంచనాలున్నాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబో అంటే ఆ మాత్రం ఉండాల్సిందే అంటూ ప్రభాస్ ఫాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు. యాక్షన్ ప్యాకెడ్ మూవీ గా తెరకెక్కుతున్న సలార్ మూవీ షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. హీరోయిన్ శృతి హాసన్ కూడా పాల్గొంటున్న ఈ షడ్యూల్ లో కీలకమైన యాక్షన్ ఘటాలను ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తుంది. సలార్ షూట్ రెస్యూమ్ దగ్గర నుండి ఆ సినిమాపై సోషల్ మీడియాలో గంటకో న్యూస్ ప్రచారంలోకి వస్తుంది.

తాజాగా సలార్ క్లైమాక్స్ పై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటికి వచ్చింది. సలార్ లో దాదాపుగా 12 మంది విలన్స్ ఉండబోతున్నారని, దునియా విజయ్, జగపతి బాబు, పృథ్వి రాజ్ సుకుమారన్ ఇలా చాలామంది ఉంటారని, క్లైమాక్స్ లో ఈ విలన్స్ అందరూ ప్రభాస్ తో తలపడతారని, ఆ క్లైమాక్స్ ఫైట్ ని ప్రశాంత్ నీల్ సముద్రంలో ప్లాన్ చేసారని తెలుస్తుంది. ముఖ్యంగా సముద్రం లోపల చేసే ఛేజింగ్ యాక్షన్ సీక్వెన్స్ ఓ రేంజ్ లో ఉండబోతున్నాయంటూ ఆ న్యూస్ సారాంశం. మరి కెజిఎఫ్ చాప్టర్ 2 హై యాక్షన్ వోల్టేజ్ తర్వాత ఆ రేంజ్ కి డబుల్ డోస్ లోనే సలార్ ఉంటుంది అంటూ సలార్ మేకర్స్ సినిమాపై అంచనాలు పెరిగేలా చేస్తున్నారు.

Salaar: Prabhas sensation in the ocean:

Salaar movie latest update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ