ఇప్పుడు హిట్ టాక్ వచ్చిన సినిమాలైనా, బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిన సినిమాలకైనా మొదటి మూడు రోజులే అద్భుతమైన కలెక్షన్స్ వస్తున్నాయి. ప్రేక్షకులు ఆహ ఓహో అన్న సినిమాలు కూడా మూడు రోజుల ముచ్చటే అన్నట్టుగా ఉంది ప్రస్తుత పరిస్థితి. సినిమా శుక్రవారం విడుదలైనా ఆ శని, ఆది వారాల బుకింగ్స్ తో థియేటర్స్ కళకళలాడుతున్నాయి. శని, ఆదివారాలు మాత్రమే ప్రేక్షకులతో కిల కిలమంటున్నాయి. కానీ ఆ సినిమాలకు అసలు పరిక్ష సోమవారం అంటే వీక్ డేస్ లోనే మొదలవుతుంది. వీక్ డేస్ లో థియేటర్స్ ఆక్యుపెన్సీ అంతమాత్రంగానే కనబడుతుంది. మార్నింగ్ షో, మ్యాట్నీ షోస్ కి సోమవారం నుండి ప్రేక్షకులు కానరావడం లేదు. హిట్ సినిమాలైతే సోమవారం నుండి నైట్ షోస్ ఫుల్ అవుతున్నాయి.
ఇక ఈ వారం నవ్వుల ఫ్రాంచైజీగా ఆడియన్స్ ముందుకు వచ్చిన F3 మూవీ కి సూపర్ హిట్ టాక్ పడడం, క్రిటిక్స్ అద్భుతమైన రివ్యూస్ ఇవ్వడం, సినిమాలో కామెడీ పుష్కలంగా ఉండడంతో గత మూడు రోజులు అంటే ఫస్ట్ వీకెండ్ లో ఆడియన్స్ థియేటర్స్ కి పరుగులు పెట్టారు. అలాగే F3 ప్రమోషన్స్ కూడా అనిల్ రావిపూడి తన హీరోలు వెంకటేష్, వరుణ్ తేజ్ లు కలిసి చేసిన డిఫ్రెంట్ ప్రమోషన్స్ సినిమాపై అందరిలో క్యూరియాసిటీని పెంచాయి. అందులోను హిట్ టాక్ పడింది. సో మూడు రోజులు థియేటర్స్ ఫుల్. మరి సోమవారం నుండి F3 కి అసలు పరిక్ష మొదలవుతుందా? లేదంటే వీక్ డేస్ ని లెక్క చెయ్యకుండా F3 కామెడీని ఎంజాయ్ చెయ్యడానికి ఆడియన్స్ థియేటర్స్ క్యూ కడతారో అనేది ఈ రోజు సాయంత్రానికి తేలిపోతుంది.