Advertisementt

సలార్ లో భారీ మార్పులు?

Sun 29th May 2022 09:44 PM
prabhas,salaar,prabhas salaar update,prashanth neel  సలార్ లో భారీ మార్పులు?
Prabhas mindblowing stunts in Salaar సలార్ లో భారీ మార్పులు?
Advertisement
Ads by CJ

ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న మాస్ పాన్ ఇండియా ఫిలిం సలార్. సలార్ కొత్త షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్ లోనే జరుగుతుంది. ఈ షెడ్యూల్ లో హీరోయిన్ శృతి హాసన్, ప్రభాస్ పై కీలక సన్నివేశాలతో పాటుగా హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ ని ప్రశాంత్ నీల్ ప్లాన్ చేసారు. అయితే ప్రశాంత్ నీల్ కేజిఎఫ్ చాప్టర్ 2 తో మాస్ హిట్ కొట్టాక.. సలార్ కి అదే మాస్ యాక్షన్ అప్లై చేస్తున్నారట. సలార్ కూడా యాక్షన్ ఓరియెంటెడ్ ఫిలిం అయినా.. ఇప్పుడు కెజిఎఫ్ సక్సెస్ తో ప్రశాంత్ నీల్ సలార్ స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేసి మరీ సెట్స్ లోకి వచ్చినట్లుగా తెలుస్తుంది.

మరీ ముఖ్యంగా సలార్ లో ప్రభాస్ ఎలివేషన్స్ సీన్స్ ఎక్కువగా ఉండేటట్టుగా చూస్తున్నారట. కేజీఎఫ్‌లో యశ్ ని చూపించిన దానికంటే హైప్‌తో సలార్ లో ప్రభాస్‌ను చూపించాలనే ఉద్దేశంతోనే ప్రశాంత్ నీల్ స్రిప్ట్ లో మార్పులు చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు జరుగుతున్న షెడ్యూల్ లోనే హీరో ఎలివేషన్ సీన్స్ పై ప్రశాంత్ నీల్ దృష్టి పెట్టినట్లుగా తెలుస్తుంది. అలాగే ఇంతకుముందు అనుకున్న యాక్షన్ సీక్వెన్స్ నిడివిని కూడా కాసింత తగ్గించాలని అనుకుంటున్నాడట. మరి అలాగైతే సలార్ ముందు అనుకున్న స్క్రిప్ట్ లో భారీ మార్పులు చేసినట్టే అంటున్నారు.

Prabhas mindblowing stunts in Salaar:

Prabhas Salaar update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ