టాలీవుడ్ పెద్దగా పట్టించుకోకపోయినా.. బాలీవుడ్ ని నమ్ముకుని అందాల ఆరబోత విషయంలో రోజు రోజుకి శృతి మించిపోతున్న రకుల్ ప్రీత్.. ఈమధ్యనే తన లవ్ ఎందుకు బయట పెట్టాల్సి వచ్చింది, జాకీ ప్రేమని పొందాక.. దానిని బయట పెట్టకపోతే రకరకాల రూమర్స్ స్ప్రెడ్ అయ్యి మనశాంతిని దూరం చేసుకోవాలి అంటూ చెప్పుకొచ్చింది. ఇక పెళ్లి విషయంలో మాత్రం కన్ఫ్యూజ్ చేసే రకుల్ తాను పెళ్ళెప్పుడు చేసుకోవాలో తనకి తెలుసు అని, అది కూడా మీకు చెప్పే చేసుకుంటాను, ముందు మేము చేసే పనిని చూడండి, మాలోని లోపాలను వెతక్కండి అంటూ నెటిజెన్స్ పై అప్పుడప్పుడు ఫైర్ కూడా అవుతుంది. ఇక టాలీవుడ్ ఆఫర్స్ కోసం పారితోషకం కూడా తగ్గించుకోబోతుంది అని అంటున్నారు. అలాగే మంచి కంటెంట్ ఉంటే.. డిజిటల్ ఎంట్రీకి సిద్దమే అంటూ రకుల్ స్టేట్మెంట్ కూడా పాస్ చేసింది.
సోషల్ మీడియాలో గ్లామర్ షో చేసే రకుల్.. ఈమధ్యన మరింత మెరిసిపోతూ గ్లామర్ ని చూపించేస్తుంది. ఒకప్పుడు బబ్లీ గా బొద్దుగా అందంగా కళగా ఉండే రకుల్ ప్రీత్ ఈమధ్యన మరీ చిక్కిపోయి బాలీవుడ్ ఆఫర్స్ కోసం వర్కౌట్స్ పెంచేస్తుంది. ఇక తాజాగా సారీ లో రకుల్ అందాలు చూస్తే వామ్మో రకుల్ సోయగం హీటెక్కిస్తోంది అంటారు. క్లివేజ్ షో తో రకుల్ సారీ అందాలు ఓ రేంజ్ లో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే రకుల్ బాలీవుడ్ ని నమ్ముకుని కూర్చున్నా.. అమ్మడు అక్కడ నటించిన ఏ చిత్రమూ హిట్ అయినా దాఖలాలు లేవు. అందుకే రకుల్ కి ఈ గ్లామర్ కష్టాలు.