Advertisementt

RC15 టైటిల్ పై మెగా ఫాన్స్ లో కంగారు

Sun 29th May 2022 01:52 PM
rc15,ram charan,shankar,mega fans  RC15 టైటిల్ పై మెగా ఫాన్స్ లో కంగారు
Mega fans reaction to RC15 title RC15 టైటిల్ పై మెగా ఫాన్స్ లో కంగారు
Advertisement
Ads by CJ

రామ్ చరణ్ - శంకర్ కాంబోలో త్రీ లాంగ్వేజెస్ లో భారీ బడ్జెట్ తో భారీగా తెరకెక్కుతున్న RC15 షూటింగ్ రీసెంట్ గానే వైజాగ్ షెడ్యూల్ ముగించుకుని టీం హైద్రాబాద్ కి చేరుకుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యూయెల్ రోల్ పోషిస్తున్నాడని, అందులో ఒకటి తండ్రి కేరెక్టర్, మరొకటి స్టూడెంట్ కేరెక్టర్ అంటూ ప్రచారం జరగడం ఆయా కేరెక్టర్స్ లుక్స్ కూడా సెట్స్ నుండి లీక్ అవడంతో మెగా ఫాన్స్ సంబరాలు చేసుకున్నారు. ఇప్పుడు RC15 షూటింగ్ హైదరాబాద్ లోను, మారేడుమిల్లు లోను ప్లాన్ చేసింది టీం. అయితే గత కొన్ని రోజులుగా RC15 టైటిల్ పై రకరకాల గాసిప్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.

ఈ సినిమాలో రామ్ చరణ్ గవర్నమెంట్ ఆఫీసర్ గా, ఎలక్షన్ కమిషనర్ గా కనిపిస్తాడని.. అందుకే RC15 కి సర్కారోడు అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లుగా వార్తలొచ్చాయి. కానీ శంకర్ కి ఆ టైటిల్ పై అంతగా గురి లేకపోవడంతో ఫైనల్ గా ఓ టైటిల్ ని అనుకుంటున్నారట. అది రామ్ చరణ్ కేరెక్టర్ కి సంబంధించి అధికారి అని పెడితే అటు తమిళ్, ఇటు తెలుగు, అలాగే హిందీ భాషలకు ఒకటే టైటిల్ మ్యాచ్ అవుతుంది.. ఈ టైటిల్ త్వరగా జనాల్లోకి వెళుతుంది అని అనుకుంటున్నారట. కానీ సర్కారోడు, అధికారి రెండు టైటిల్స్ రామ్ చరణ్ కి మ్యాచ్ కావని, టైటిల్ మార్చమని మెగా ఫాన్స్ శంకర్ ని రిక్వెస్ట్ చేస్తున్నారట.

Mega fans reaction to RC15 title:

RC15 Mega fans talking about that title

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ