Advertisementt

శృతి హాసన్ ని ఫిదా చేసిన ప్రభాస్

Sun 29th May 2022 01:29 PM
prabhas,special food,shruti haasan,salaar,prashanth neel,deepika padukone  శృతి హాసన్ ని ఫిదా చేసిన ప్రభాస్
Prabhas Sent Special Food To Sruthi Hassan శృతి హాసన్ ని ఫిదా చేసిన ప్రభాస్
Advertisement
Ads by CJ

ప్రభాస్ ప్రస్తుతం ప్రాజెక్ట్ కే షూటింగ్ కి విరామం ఇచ్చి.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో సలార్ కొత్త షెడ్యూల్ షూటింగ్ చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది. ఈ షెడ్యూల్ లో ప్రభాస్ తో పాటుగా మెయిన్ విలన్స్ అలాగే, హీరోయిన్ శృతి హాసన్ కూడా పాల్గొంటున్నారు. అయితే ఇంతకుముందే ప్రభాస్ తో వర్క్ చేయడంపై తెగ ఎగ్జైట్ అయిన శృతి హాసన్ ప్రభాస్ ఇచ్చిన ట్రీట్ కి అప్పుడే పడిపోయింది. ఇప్పుడు ప్రభాస్ మరోసారి ఫుడ్ తో ఫిదా చేసినట్లుగా శృతి హాసన్ ఇన్స్టా స్టోరీస్ లో పోస్ట్ చేసింది.

ప్రభాస్ తో వర్క్ చేసే హీరోయిన్స్ అయినా, ఆయనతో పని చేసే సహనటులకైనా ప్రభాస్ తన ఆదిత్యంతో ఉక్కిరిబిక్కిరి చేస్తారు. తన వంటమనిషి తో స్పెషల్ గా చేయించిన వంటకాలతో తనతో వర్క్ చేసే హీరోయిన్స్ కి రుచి చూపిస్తారు. ఇంతకుముందు శ్రద్ద కపూర్, ఇప్పుడు దీపికా పదుకొనే, దిశా పటాని, ఆదిపురుష్ లో విలన్ రావన్ సైఫ్ అలీఖాన్ వైఫ్ కరీనా కపూర్ కి తన ఇంటి ఫుడ్ ని టేస్ట్ చూపించిన ప్రభాస్ తాజాగా శృతి హాసన్ కి సెకండ్ టైం నాన్ వెజ్ ఐటమ్స్ తో ఆదిత్యం ఇచ్చి ఫిదా చేసారు. ఆ ఫుడ్ టేస్ట్ చేసిన శృతి హాసన్ థాంక్యూ ప్రభాస్ అంటూ.. ప్రభాస్ ఇంటి ఫుడ్‌కు సంబంధించిన నోరూరించి వంటకాల వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ వీడియో బ్యాగ్రౌండ్ లో ప్రభాస్ ఎల్లుండి మటన్, కోడి కూర వస్తుంది అంటూ చెప్పడం ఆ వీడియో కి హైలెట్ అయ్యింది.

Prabhas Sent Special Food To Sruthi Hassan:

Prabhas Sending Special Food for Shruti Haasan On the sets of Salaar

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ