నయనతార-విగ్నేష్ శివన్ పెళ్లి వార్తలతో సోషల్ మీడియా నిండిపోయింది. జూన్ 9 న నయనతార - విగ్నేష్ శివన్ లు తిరుపతిలో పెళ్లి చేసుకోబోతున్నారని, ఇప్పటికే వేదిక ఖరారు చేసుకున్నారని, అలాగే కుల దేవత గుడిలో పొంగల్ పెట్టిన ఈ జంట పెళ్ళి పనుల్లో నిమగ్నమై ఉంది అంటూ ప్రచారం జరగడమే కానీ.. నయనతార నుండి కానీ, విగ్నేష్ శివన్ ఫ్యామిలీ నుండి కానీ ఈ పెళ్లి విషయమై క్లారిటీ లేదు. అయితే తాజా సమాచారం ప్రకారం నయనతార వెడ్డింగ్ ఇన్విటేషన్ రెడీ అవడమే కాదు.. ఆ డిజిటల్ ఇన్విటేషన్ సన్నిహితులకు వెళ్ళినట్టుగా తెలుస్తుంది.
నయనతార - విగ్నేష్ శివన్ లు తమ పెళ్ళి అతికొద్దిమంది స్నేహితులు, సన్నిహితులు, ఫ్యామిలీ మెంబెర్స్ మధ్యనే చేసుకోవాలని అనుకుంటున్నారట. ఇప్పటికే కొద్దిమంది అతిథులకు డిజిటల్ వీడియో ఇన్విటేషన్ కార్డ్ పంపినట్టుగా తెలుస్తుంది. అయితే ఆ డిజిటల్ ఇన్విటేషన్ ప్రకారం నయనతార - విగ్నేష్ ల పెళ్లి జూన్ 9 మహాబలిపురంలోని ఓ రిసార్ట్స్ లో జరగనున్నట్లుగా తెలుస్తుంది. మరి తిరుపతిలో నయన్ పెళ్లి కూతురు కాబోతుంది అన్నప్పటికీ.. బయటికి వచ్చిన ఇన్విటేషన్ ప్రకారం మహాబలిపురంలో నయన్ పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది.